రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణానికి చెందిన తాండూరు పురపాలక సంఘము 1953, నవంబర్ 23న మూడవ గ్రేడు పురపాలక సంఘముగా ప్రారంభించబడింది. 2010లో ఈ పురపాలక సంఘం గ్రేడును రెండవశ్రేణి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రస్తుతం ఇందులో 31 వార్డులు కలవు. పురపాలక సంఘ పరిధిలో 2001 ప్రకారం జనాభా 57941 కాగా, 2011 నాటికి 65115కు పెరిగింది.
తాండూరు పురపాలకసంఘం మొదటి చైర్మెన్‌గా ముధెళ్ళి నారాయణరావు పనిచేశారు. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 70 వేలకు పైగా జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. అలాగే భవన నిర్మాణాల పరిశ్రల ఏర్పాటు అనుమతులకు మునిసిపాలిటీకి అనుమతి ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం పట్టణ పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు తరఫున ఒక వార్డు మెంబర్ పురపాలక సంఘంలో ఆ వార్డు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల సమస్యలను పరిష్కరించుటకు కృషిచేస్తారు. 2014 ఎన్నికలు: 2014 మార్చి 30న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 12న వెలువడ్డాయి. 31 వార్డులలో తెరాస 10, ఎంఐఎం 10, కాంగ్రెస్ పార్టీ 8, తెలుగుదేశం పార్టీ 2, భాజపా 1 స్థానాలలో విజయం సాధించాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
4, మార్చి 2014, మంగళవారం
తాండూరు పురపాలక సంఘము (Tandur Muncipality)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి