చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 2009 పునర్విభజనలో రిజర్వ్‌డ్‌గా మారింది.
నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 5 మండలాలు కలవు.
1999 ఎన్నికలు:
1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఇంద్రారెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.లక్ష్మారెడ్డిపై సుమారు 10000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఇంద్రారెడ్డి తెలుగుదేశం (ఎన్టీఆర్) పార్టీ నుండి ఎన్నికలకు కొద్ది ముందు మాత్రమే కాంగ్రెస్‌లో చేరి తెలుగుదేశంపై గెలుపొందడం విశేషం. 2000 ఉప ఎన్నికలు: పి.ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం వలన ఏర్పడిన ఖాళీతో 2000 మే 20న జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి 29909 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి కె.లక్ష్మారెడ్డిపై విజయం సాధించింది. సబితకు 84448 ఓట్లు లభించగా, లక్ష్మారెడ్డి 54539 ఓట్లు సాధించాడు. ఈ ఎన్నికలలో మొత్తం ఆరుగురు పోటీచేశారు. 2004 ఎన్నికలు: 2004 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పి.సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 41585 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. పోటీచేసిన మరో ఇద్దరికి ధరావత్తు దక్కలేదు. సబితకు 96995 ఓట్లు రాగా, భూపాల్‌రెడ్డి 55410 ఓట్లు సాధించాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా స్థానం లభించింది.
2009 ఎన్నికలు: 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.ఎస్.రత్నం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టికి చెందిన యాదయ్యపై 2258 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు:2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన కే.ఎస్.రత్నంపై 781 ఓట్ల స్వల్ప మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున కాలె యాదయ్య, భాజపా తరఫున కంజర్ల ప్రకాష్, ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.రత్నం పోటీచేశారు. తెరాసకు చెందిన కాలె యాదయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.రత్నం పై 33552 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
2, ఏప్రిల్ 2014, బుధవారం
చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం (Chevella Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి