3, ఏప్రిల్ 2014, గురువారం

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం (Tadepalligudem Assembly Constituency)

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 2 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • తాడేపల్లిగూడెం,
  • పెంటపాడు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కనక సుందరరావు తెలుగుదేశం పార్టీ
2009 ఈలినాని ప్రజారాజ్యం పార్టీ కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
2014 పి.మాణిక్యాలరావు భాజపా తోట గోపి వైఎస్సార్ కాంగ్రెస్
2019 కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ ఈలి వెంకట మధుసూధనరావు (నాని) తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనక సుందరరావుపై 24933 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సత్యనారాయణకు 72477 ఓట్లు లభించగా, సుందరరావు 47544 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈలినాని (వెంకట మధుసూధనరావు) తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై 2879 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి భారతీయ జనతాపార్టీకి చెందిన పి.మాణిక్యాలరావు తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట గోపిపై 14073 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పారీ ఈ స్థానాన్ని భాజపాకు కేటాయించింది.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన కొట్టు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఈలి వెంకట మధుసూధనరావు (నాని)పై 16,466  ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 70,741 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 54,275 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన బోలిశెట్టి శ్రీనివాస్ 36,197 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నరసాపురం లోకసభ నియోజకవర్గం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక