6, మే 2014, మంగళవారం

ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (Allagadda Assembly Constituency)

ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 253. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 134 గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 శోభానాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ గంగుల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2012* శోభానాగిరెడ్డి వైకాపా గంగుల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 శోభానాగిరెడ్డి వైకాపా గంగుల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014* అఖిల వైకాపా ఏకగ్రీవ ఎన్నిక
2019 గంగుల బ్రిజెంద్ర రెడ్డి (నాని) వైకాపా భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి తన సమీప్ర ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 1958 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన శోభానాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డిపై 36795 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 202977 ఓట్లలో 168365 పోల్ కాగా అందులో వైకాపాకు 88697 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 51902 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 20374 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసిన శోభానాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన గంగుల ప్రతాప్‌రెడ్డిపై 17928 ఓట్ల ఆధ్క్యతతో విజయం సాధించారు. అయితే శోభానాగిరెడ్డి ఎన్నికలకు ముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయారు.

2014 ఉప ఎన్నికలు:
2014 అక్టోబరు 24న జరిగిన ఉప ఎన్నికలో భూమానాగిరెడ్డి, శోభారెడ్డిల కూతురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అఖిల ఏకగ్రీవంగా ఎన్నికైంది. 

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన గంగుల బ్రిజెంద్ర రెడ్డి (నాని) తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా అఖిలప్రియపై 35613 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: కర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నంద్యాల లోకసభ నియోజకవర్గం, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక