2, ఆగస్టు 2014, శనివారం

అలెగ్జాండర్ గ్రహంబెల్ (Alexander Graham Bell)

అలెగ్జాండర్ గ్రహంబెల్
జననంమార్చి 3, 1847
రంగంశాస్త్రవేత్త
ప్రత్యేకతటెలిఫోన్ రూపకర్త
మరణం2 ఆగష్టు, 1922
ప్రముఖ శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రహంబెల్ మార్చి 3, 1847న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు.

ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్‌ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్‌ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్‌ టెలికమ్యూనికేషన్స్‌, హైడ్రోఫాయిల్స్‌, ఏరోనాటిక్స్‌ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్‌ కూడా ఒకరు.

1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2 ఆగష్టు, 1922న గ్రహంబెల్ మరణించాడు. అలెగ్జాండర్ గ్రహంబెల్ జన్మదినాన్ని టెలిఫోన్ దినోత్సవంగా జరుపుకుంటారు.

విభాగాలు: శాస్త్రవేత్తలు, స్కాట్లాండ్ ప్రముఖులు, 1847లో జన్మించినవారు, 1922లో మరణించినవారు, ఆవిష్కర్తలు,


 = = = = =


Tags:Alexander Graham Bell in telugu, famous scientists biography in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక