ప్రముఖ శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ గ్రహంబెల్ మార్చి 3, 1847న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు.
ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్ టెలికమ్యూనికేషన్స్, హైడ్రోఫాయిల్స్, ఏరోనాటిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్ కూడా ఒకరు. 1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2 ఆగష్టు, 1922న గ్రహంబెల్ మరణించాడు. అలెగ్జాండర్ గ్రహంబెల్ జన్మదినాన్ని టెలిఫోన్ దినోత్సవంగా జరుపుకుంటారు.
= = = = =
|
Tags:Alexander Graham Bell in telugu, famous scientists biography in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి