ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ 17 మార్చి, 1990 న హర్యానాలోని హిస్సార్‌లో జన్మించింది. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన సైనా పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజేతగా నిల్చి దేశానికి పేరుతెచ్చింది.
క్రీడా ప్రస్థానం: 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది. 2007లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2008లోనే ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించింది. 2009లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది. 2010లో ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది. 2011లో ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సీరీస్‌లో క్వార్టర్ ఫైనల్లో చేరడమే కాకుండా ఇండోనేషియా సూపర్ సీరీస్ టైటిల్ సాధించింది. జపాన్ ఓపెన్ సీరీస్ లో సెమీస్ వరకు, చైనా మాస్టర్ సీరీస్ మరియు హాంగ్‌కాంగ్ సూపర్ సీరీస్‌లలో క్వార్టర్ వరకు ఆడింది. 2012లో ఇండోనేషియా సూపర్ సీరీస్ మరియు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సీరీస్‌లలో విజేతగా నిలిచింది. ఫ్రెంచ్ సూపర్ సీరీస్‌లో ఫైనల్ వరకు, మలేషియా ఓపెన్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వరకు, కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ మరియు ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సీరీస్ లలో క్వార్టర్స్ వరకు ఆడగలిగింది. 2013లో ప్రధాన టోర్నీలలో టైటిల్ సాధించకున్ననూ మలేషియా, ఆల్ ఇంగ్లాండ్ మరియు ఇండోనేషియా సూపర్ సీరీస్‌లలో సెమీస్ వరకు వెళ్ళగలిగింది. కొరియా మరియు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సీరీస్‌లలో క్వార్టర్స్ వరకు ఆడింది. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించింది. ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్ టైటిల్ కూడా సాధించింది. ఆల్ ఇంగ్లాండ్, ఇండియా, ఇండోనేషియా సూపర్ సీరీస్‌లలో క్వార్టర్స్ వరకు ఆడింది. 2015 మార్చిలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది. 2015 ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతపతకం సాధించింది. ఫైనల్లో ఓడిననూ ఫైనల్స్‌కు వెళ్ళిన తొలి భారతీయురాలిగా అవతరించింది. అవార్డులు: సైనా నెహ్వాల్ సాధించిన విజయాలకు గుర్తింఫులుగా పలు అవార్డులు లభించాయి. 2009లో అర్జున అవార్డు, 2009-10లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, 2010లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇవి కూడా చూడండి:
ఇవి కూడా చూడండి ... కిదాంబి శ్రీకాంత్, పి.వి.సింధూ,
= = = = =
|
5, ఆగస్టు 2014, మంగళవారం
సైనా నెహ్వాల్ (Saina Nehwal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి