20, నవంబర్ 2014, గురువారం

కిదాంబి శ్రీకాంత్ (Srikanth Kidambi)

జననంఫిబ్రవరి 7, 1993
స్వస్థలంగుంటూరు
రంగంబ్యాడ్మింటన్ క్రీడాకారుడు
బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన శ్రీకాంత్ నమ్మళ్వార్ కిదాంబి ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొంది రాటుదేలాడు. ఇతను నవంబరు 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకున్నాడు.2017 సింగపూర్ ఓపెన్‌ ఫైనల్లో సాయి ప్రణీత్ చేతిలో ఓడి రెండోస్థానంలో నిలిచాడు. తర్వాత 2017లో ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయునిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.

క్రీడా ప్రస్థానం:

2011లో లక్నోలో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ పోటీలలో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాంస్యపతకం సాధించాడు. అదే ఏడాది పూనేలో జరిగిన ఆలిండియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ మరియు డబుల్స్ రెండింటిలోనూ విజేతగా నిలిచాడు. 2011 కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో బాలుర విభాగంలో కాంస్యపతకం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతపతకం సాధించాడు. 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో అవథ్ ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండోస్థానంలో నిలిపాడు. 2014లో మలేషియా ఓపెన్‌లో క్వార్టర్ వరకు వెళ్ళగలిగాడు. 2014 నవంబరులో జరిగిన చైనా ఓపెన్ సూపర్ సీరీస్ లో అగ్రశ్రేణి ఆటగాడు లిన్ డాన్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు.

2015లో స్వి ఓపెన్ మరియు ఇండియా ఓపెన్ సింగిల్స్ టైటిళ్ళను సాధించాడు. అదే సం.లో సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ మరియు ఇండోనేషియన్ మాస్టర్స్‌లలో ఫైనల్ వరకు వెళ్ళాడు. 2016లో సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ మరియు దక్షిణాసియా క్రీడల సింగిల్స్ టైటిళ్ళను సాధించాడు. 2017లో సింగపూర్ ఓపెన్ ఫైనల్లో భారత్‌కే చెందిన సాయి ప్రణీత్ చేతిలో ఓడిననూ ఇండోనేషియా ఓపెన్‌ సింగిల్స్ టైటిల్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

కిదాంబి శ్రీకాంత్ తన కెరీర్‌లో 7 ప్రధాన టైటిళ్ళను సాధించాడు.
 • 2012--మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్
 • 2013--థాయిలాండ్ ఓపెన్
 • 2014--చైనా ఓపెన్
 • 2015--స్విస్ ఓపెన్
 • 2015--ఇండియా ఓపెన్
 • 2016--సయ్యద్ మోడి ఇంటర్నేషనల్
 • 2016--దక్షిణాసియా క్రీడల తైటి
 • 2017--ఇండోనేషియా ఓపెన్

విభాగాలు: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు, గుంటూరు జిల్లా క్రీడాకారులు, గుంటూరు, 1993లో జన్మించినవారు, 


 = = = = =


tags: Kidambi Srikanth in telugu, Badminton players biography in telugu, indian sports persons in telugu, sports quiz in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక