భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసిన వి.వి.గిరి ఆగస్టు 10, 1894న ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హంపూరులో జన్మించారు. ఈయన పూర్తి పేరు వరహగిరి వెంకటగిరి. వీరి పూర్వీకులు తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందినవారు. విదేశాలలో విద్యాభ్యాసం ముగించి భారత్ వచ్చిన పిదప వి.వి.గిరి కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యారు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు.
1936లో మద్రాసు రాష్ట్రపు శాసనసభ ఎన్నికల్లో గిరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి విజయం సాధించారు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, వి.వి.గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన పిమ్మట ఈయన సిలోన్ (ఇప్పటి శ్రీలంక)కు రాయబారిగా పనిచేశారు. 1952లో తొలి లోకసభ ఎన్నికలలో పాతపట్నం నుంచి ఎన్నికై 1954లో రాజీనామా చేసే వరకు కార్మిక మంత్రిగా వ్యవహరించారు. 1957లో ఇండియన్ సొసైటి ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ స్థాపించి కార్మికుల ఉన్నతికి పాటుపడ్డారు. 1956-60 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా, 1960-65 వరకు కేరళ గవర్నరుగా, 1965-67 వరకు కర్ణాటక గవర్నరుగా సేవలందించారు. 1967లో 3వ ఉప రాష్ట్రపతిగా, 1969లో భారతదేశ 4వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1975లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఈయన "ఇండస్ట్రియల్ రిలేషన్స్" అనే గ్రంథాన్ని కూడా రచించారు. వి.వి.గిరి జూన్ 23, 1980న మరణించారు.
= = = = =
|
10, ఆగస్టు 2014, ఆదివారం
వి.వి.గిరి (V.V.Giri)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి