ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైన వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ నవంబర్ 1, 1974లో హైదరాబాదులో జన్మించారు. లక్ష్మణ్ భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 134 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 17 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టు కు మరియు ఇంగ్లాద్ దేశవాళీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాడు. 2008 లో జరిగిన మొట్టమొధటి ఐపిఎల్ లో దెక్కన్ ఛార్జర్స్ జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాడు. 2011లో లక్ష్మణ్ కు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం లభించింది.
2001లో జరిగిన కలకత్తాలో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడిలో ఆస్ట్రేలియా పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ 2004 లో పాకిస్తాన్ తో ముల్తాన్ లో 309 పరుగులు చేసేవరకు భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగ స్కోరుగా ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. పలు సందర్భాలలో భారీ స్కోరుతో జట్టును ఆదుకోవడంతో ఇయాన్ చాపెల్ లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.
= = = = =
|
5, ఆగస్టు 2014, మంగళవారం
వి.వి.ఎస్.లక్ష్మణ్ (V.V.S.Laxman)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి