భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. 'పాలమూరు సాహితి' అను సాహిత్య సంస్థను, 'పాలమూరు కల్చరల్ అకాడామీ' అను సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదికలోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పాలమూరు సాహితి ద్వారా తన సంపాదకత్వంలో 'అంజలి', 'పాలమూరు కవితా సుమాలు' అను పుస్తకాలను వెలువరించారు. తరువాత జిల్లాకు చెందిన వందమంది కవుల కవితలను సేకరించి 'పాలమూరు కవిత' పుస్తకాన్ని వెలువరించాడు. తెలంగాణ మీద హైకూలు రాసి 'సోది' పేరుతో 2004లో వెలువరించి ఈ పుస్తకాన్ని కాళోజి నారాయణరావుకు అంకితమిచ్చారు. 'ప్రేమికులు' ప్రయివేట్ ఆడియో అల్బంకు పాటలు రాశారు. నేటి విద్యార్థి, నిజం అనే సింగిల్ ఎపిసోడ్ లకు మాటలు రాశారు. నాలో ఉన్న ప్రేమ అను సింగిల్ ఎపిసోడ్ కు కథ, మాటలు రాశారు. ఛాంపియన్ అను టెలిఫిల్ంకు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం వహించారు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక పత్రికలలో వెలువడ్డాయి.
గుర్తింపులు: ఈయన సాహితీ సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1996లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును, 2002లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డును అందుకున్నారు.
= = = = =
|
Tags: Bheempally Srikanth in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి