25, జులై 2019, గురువారం

బి.ఎస్.యడ్యూరప్ప (B.S.Yeddyurappa)

బి.ఎస్.యడ్యూరప్ప
జననంఫిబ్రవరి 27, 1943
స్వస్థలంబూకనాకెరె
పదవులుకర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా ఉపాధ్యక్షుడు,
కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బి.ఎస్.యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో జన్మించారు. ప్రారంభంలో ఆరెస్సెస్ కార్యకర్తగా ఉంటూ, రాజకీయాలలో ప్రవేశించి క్రమక్రమంగా ఎదుగుతూ పురపాలక సంఘం చైర్మెన్‌గా, భాజపా జిల్లా అధ్యక్షుడిగా, కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షునిగా పనిచేసి 2007లో కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో భాజపా ఉపాధ్యక్ష పదవి పొందారు. 2019 జూలైలో 3వ సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రాజకీయ ప్రస్థానం:
యడ్యూరప్ప 1970లో శికారిపుర శాఖకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడి 1972లో తాలుకా శాఖకు జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో శికారిపుర పురపాలక సంఘపు అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాకుకా భాజపా అధ్యక్షుడిగాను, ఆ తరువాత శిమోగా జిల్లా భాజపా అధ్యక్షుడుగాను పనిచేశారు. 1988 నాటికి కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎదిగారు. 1983లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2007 నవంబర్‌లో ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించడంతో మే 30, 2008న రెండో పర్యాయం కర్ణాటక ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భాజపా నేతగా రికార్డు సృష్టించారు. అక్రమ మైనింగ్ కేసు కారణంగా 2011 జూలైలో ముఖ్యమంత్రి పదవి వదిలివేయాల్సి వచ్చింది. 2012 నవంబరులో భాజపాకు రాజీనామా చేసి కర్ణాటక జనతా పార్టీ పేరుతో కొత్తపార్టీని స్థాపించరు. 2013 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ విజయం సాధించకపోవడంతో జనవరి 2014లో మళ్ళీ భాజపాలో ప్రవేశించారు. ఆ తర్వాత భాజపా ఉపాధ్యక్ష పదవి పొందినారు. 2016లో మళ్ళీ కర్ణాటక భాజపా అధ్యక్షుడిగా నియమితులైనారు. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో యడ్యూరప్ప భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. కాని పార్టీకి కొన్ని స్థానాలు తక్కువ వచ్చాయి. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా జూలై 26, 2019న 3వ సారి ముఖ్యమంత్రి అయ్యారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: కర్ణాటక ముఖ్యమంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, 16వ లోకసభ సభ్యులు, 1943లో జన్మించినవారు,


 = = = = =


Tags: About B.S.Yadyurappa, biography of B.S.Yadyurappa in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక