ఎర్గట్ల నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 8 గ్రామపంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నిజామాబాదు జిల్లాలో ఈశాన్యంలో నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల జిల్లా సరిహద్దులో ఉంది. రెడ్‌బస్ సృష్టికర్త ఫణీంద్రసామ ఈ మండలానికి చెందినవాడు.
అక్టోబరు 11, 2016న ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు. అదివరకు మోర్తాడ్ మండలంలో ఉన్న 7 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఎర్గట్ల మడలం నిజామాబాదు జిల్లాలో ఈశాన్యంలో ఉంది. దక్షిణాన కమ్మర్‌పల్లి మండలం, మోర్తాడ్ మండలం, పశ్చిమాన ముప్కాల్ మండలం, మెండోరా మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా, తూర్పున జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Battapur, Domchanda, Gumeriyal, Tadla Rampur, Tadpakal, Thurat, Yergatla
ప్రముఖ గ్రామాలు
తడపకల్ (Tadpakal): తడపకల్ నిజామాబాదు జిల్లా మోర్తాడ్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది తీరాన ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. రెడ్‌బస్ సృష్టికర్త ఫణీంద్రసామ తడపకల్ గ్రామానికి చెందినవాడు.
.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Yergatla Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి