24, డిసెంబర్ 2014, బుధవారం

మదన్ మోహన్ మాలవీయ (Madan Mohan Malaviya)

 మదన్ మోహన్ మాలవీయ
జననండిసెంబరు 25, 1861
రంగంస్వాతంత్ర్య సమరయోధుడు
అవార్డులుభారతరత్న (ప్రకటించబడింది)
మరణంనవంబరు 12, 1946
ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడైన మదన్ మోహన్ మాలవీయ డిసెంబరు 25, 1861న ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో జన్మించారు. 1908 మరియు 1918లలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షపదవిని నిర్వహించారు. 1909లో అలహాబాదు నుంచి ది లీడర్ ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. 1919లో వారణాసిలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి 2 దశాబ్దాల పాటు వైస్-ఛాన్సలర్‌గా కొనసాగినారు.  1924-46 కాలంలో హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు చైర్మెన్‌గా పనిచేశారు. మకరంద్ కలంపేరుతో అనేక పద్యాలు రచించారు. న్యాయవాదిగా పనిచేస్తూ జాతీయోద్యమ సమయంలో చౌరీచౌరా కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల తరఫున మాలవీయ వాదించారు. నవంబరు 12, 1946 మాలవీయ మరణించారు. 2014 సంవత్సరానికిగాను దేశంలో అత్యున్నతమైన భారతరత్న అవార్డును ప్రధానం చేస్తున్నట్లు డిసెంబరు 25, 2014న కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

బాల్యం, అభ్యసన:
మదన్ మోహన్ మాలవీయ 1861లో అలహాబాదులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి పూర్వికులు మధ్యప్రదేశ్‌లోని మాళ్వా ప్రాంతాంనికి చెందినవారు. ఆ కారణంతో ఈ కుటుంబాబికి మాళవీయులు (మాలవీయ)గా పేరు వచ్చింది. చిన్న వయస్సులోనే మకరంద్ పేరుతో పద్యాలు వ్రాసేవారు. అలహాబాదు నుంచి మెట్రిక్ ఉత్తీర్ణుడై కలకత్తా నుంచి బి.ఏ.పట్టా పొందారు.

జాతీయోద్యమం:
1886లోనే మలావీయ రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరై ప్రసంగించి పలువురు ప్రముఖులచే ఆకట్టుకున్నారు. 1909 మరియు 1918లలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. మితవాద నాయకుడిగా ఉంటూ 1916లో లక్నో ఒడంబడికను వ్యతిరేకించారు. చౌరీచౌరా సంఘటనలో బ్రిటీష్ ప్రభుత్వంచే అరెస్ట్ అయిన 177 ఉద్యమకారుల తరఫున వాదించి 156 మందిని ఉరిశిక్షబారి నుంచి తప్పించారు. 1912-26 కాలంలో శాసనసభ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకించారు. 1930లో లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. 1930లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు. 1934 ఎన్నికలలో ఈ పార్టీ కేంద్ర శాసనసభలో 12 స్థానాలు సాధించింది. మాలవీయ వారణాసిలో హిందూవిశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి దాదాపు 20 సంవత్సరాలు సంస్థాపక ఉప కులపతిగా వ్యవహరించారు. 

విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న పురస్కార గ్రహీతలు, అలహాబాదు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, 1861లో జన్మించినవారు, 1946లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక