21, ఫిబ్రవరి 2015, శనివారం

ప్రపంచకప్ క్రికెట్ 2015 (Cricket World Cup 2015)

 ప్రపంచకప్ క్రికెట్ 2015
విజేతఆస్ట్రేలియా
నిర్వహణ దేశాలుఆస్ట్రేలియా, న్యూజీలాండ్
నిర్వహణ కాలంఫిబ్రవరి 14 నుంచి మార్చి 29, 2015
నాలుగేళ్లకోసారి నిర్వహించబడే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా 11వ ప్రపంచకప్ టోర్నీ 2015 ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంటును ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీలో 14 జట్లు, 49 మ్యాచ్‌లలో పాల్గొన్నాయి. ఇందులో 26 మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో 23 మ్యాచ్‌లు న్యూజీలాండ్‌లో జరిగాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజీలాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి 5వ సారి విశ్వవిజేతగా నిలిచింది. సచిన్ టెండుల్కర్ ఈ ప్రపంచకప్‌కు బ్రాండ్ అబాసిడర్‌గా వ్యవహరించారు.

గ్రూప్ దశలు:
ఈ టోర్నమెంటులో పాల్గొంటున్న 14 దేశాలను 2 గ్రూపులుగా విభజించారు. చెరో గ్రూపు నుంచి 4 జట్లు క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించాయి. గ్రూప్-ఏలో  న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, స్కాంట్లాండ్, ఇంగ్లాండ్ దేశాలు, గ్రూప్ బిలో  భారత్, వెస్టీండీస్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్ దేశాలు ఉండగాగ్రూ-ఏ నుంచి న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బి నుంచి భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టీండీస్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి.

ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా జట్టు

క్వార్టర్ ఫైనల్స్:
మొదటి క్వార్టర్ ఫైనల్‌లో న్యూజీలాండ్ వెస్టీండీస్‌ను, రెండో క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా శ్రీలంకను, మూడో క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను, నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాయి.
సెమీ ఫైనల్స్:
మార్చి 24న జరిగిన తొలి సెమీస్‌లో న్యూజీలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో ఓడించగా, మార్చి 26న జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 95 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరాయి.

ఫైనల్ మ్యాచ్:
మార్చి 29న సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు కేవలం 3 వికెట్లు కోల్ఫోయి 33.1 ఓవర్లలోనే 186 పరుగులు చేసి ప్రపంచకప్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ నేతృత్వంలోని జట్టు ట్రోఫి అందుకుంది.

మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్
మిచెల్ స్టార్క్
ప్రైజ్ మనీ:
ఈ టోర్నమెంట్ విజేతకు $3,975,000, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు $1,750,000, సెమీస్‌లో ఓడిన జట్టుకు $600,000, క్వార్టర్స్‌లో ఓడిన జట్టుకు $300,000, గ్రూప్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు $45,000 ప్రైజ్ మని లభిస్తుంది.

2015 ప్రపంచకప్ రికార్డులు:
  • అత్యధిక టీం స్కోరు: 417/6 (ఆస్ట్రేలియా)
  • అత్యధిక పరుగులతో విజయం సాధించిన జట్టు-- ఆస్ట్రేలియా (275)
  • అత్యల్ప పరుగులు చేసిన జట్టు-- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (102)
  • టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- మార్టిన్ గుప్తిల్ (547)
  • ఒకే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు-- మార్టిన్ గుప్తిల్ (237*)
  • అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్-- మార్టిన్ గుప్తిల్ (59)
  • అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్-- క్రిస్ గేల్ (26)
  • అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్-- మిచెల్ స్టార్క్ (22)
  • అత్యధికవికెట్లు సాధించిన భారతీయ బౌలర్-- ఉమేష్ యాదవ్ (18)
  • ప్రపంచకప్‌లో వరసగా 5 మ్యాచ్‌లలో 50+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.
  • హాట్రిక్‌లు సాధించిన బౌలర్లు-- స్టీవెన్ ఫిన్, డుమ్మి.
  • ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం-- 372 (క్రిస్ గేల్ + సామ్యూల్స్) 
  • ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికంగా ఈ కప్‌లో 38 సెంచరీలు నమోదైనాయి.


విభాగాలు: ప్రపంచకప్ టోర్నమెంట్లు, క్రికెట్, 2015,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక