11, ఫిబ్రవరి 2015, బుధవారం

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)

 అరవింద్ కేజ్రీవాల్
జననంఆగస్టు 16, 1968
స్వస్థలంహిస్సార్
రంగంసామాజికవేత్త, రాజకీయాలు,
అవార్డులురామన్ మెగసెసే (2006)
పదవులుఢిల్లీ ముఖ్యమంత్రి,
ప్రముఖ సామాజికవేత్తగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన అరవింద్ కేజ్రివాల్ ఆగస్టు 16, 1968న హర్యానాలోని హిస్సార్‌లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులై, భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత సామాజిక రంగంలో ప్రవేశించి అన్నా హజారేతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాడి మంచి పేరు సంపాదించారు. ఈయన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పార్టీని స్థాపించి, 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు. లోకసభ ఎన్నికలలో ఈయన దేశ రాజకీయాలలో ప్రభావం చూపకున్ననూ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఊహించలేని విధంగా 70కి 67 స్థానాలు పొంది మరోమారు ముఖ్యమంత్రి పదవికి దగ్గరయ్యారు.

బాల్యం, విద్యాభ్యాసం:
అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని హిస్సార్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ అభ్యసించారు. సివిల్ సర్వీస్ పరీక్షలలో నెగ్గి ఇండీయన్ రెవెన్యూ సర్వీస్‌లో ప్రవేశించి కొంతకాలం ఆదాయపుపన్ను శాఖలో సంయుక్త కమీషనర్‌గా పనిచేశారు. 2012లో స్వరాజ్ అనే పుస్తకాన్ని రచించారు.

సామాజిక ఉద్యమాలు, రాజకీయాలు:
1999లో పరివరన్ పేరుతో సామాజిక సంస్థను నెలకొల్పిన కేజ్రీవాల్ ఢిల్లీ పరిధిలో పలు కుంభకోణాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. సమాచారహక్కు చట్టం ద్వారా పలు ప్రభుత్వ సంస్థలలో జరుగుతున్న అవినీతిని కూడా బయటపెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారేతో చేతులు కలిపి జనలోక్‌పాల్ బిల్లుకై ఉద్యమించారు. 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి పొందారు. ఆ ఎన్నికలలో 3 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న షీలాదీక్షిత్‌పైనే అరవింద్ విజయం సాధించారు. కొంతకాలానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2014లో లోకసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులకై కృషిచేసిననూ సఫలం కాలేరు. ఆయన స్వయంగా వారణాసిలో నరేంద్రమోడిపై పోటీచేసి పరాజయం పొందారు. 2015లో ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఊహించలేనివిధంగా 70 స్థానాలకుగాను 67 స్థానాలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయానికి కారకులై మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్నారు.

గుర్తింపులు:
2006లో సామాజిక సేవలకుగాను రామన్ మెగ్సేసే పురస్కారం పొందారు. 2011లో అన్నాహజారేతో కలిసి ఎన్డీటీవి "ఇండీయన్ ఆఫ్ ది ఇయర్" గుర్తింపు పొందారు.

విభాగాలు: హర్యానా ప్రముఖులు, ఢిల్లీ ముఖ్యమంత్రులు, రామన్ మెగ్సేసే గ్రహీతలు, 1968లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక