11, ఫిబ్రవరి 2015, బుధవారం

విష్ణుకుండినులు (Vishnukundina)

విష్ణుకుండినులు
కాలంక్రీ.శ.440 - 616
పరిధిదక్షిణ తెలంగాణ, కోస్తాంధ్ర,
గొప్పరాజురెండో మాధవవర్మ
దక్షిణ తెలంగాణ మరియు కోస్తాంద్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన విష్ణుకుండినులు క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి క్రీ.శ.7వ శతాబ్దం వరకు పాలించారు. వంశస్థాపకుడు మొదటి మాధవవర్మ. ఇతను తెలంగాణలోని ఇప్పటి నల్గొండ జిల్లా ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. విష్ణుకుండినులు మొదట దక్షిణ తెలంగాణలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు కృష్ణా-గోదావరి మధ్యప్రాంతాలను ఆక్రమించారు. శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధికప్రాంతము పాలించిన రాజవంశమిదే. 4వ మాధవవర్మ "జనాశ్రయఛందోవిచ్ఛితి" రచించాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథంగా చెప్పబడుతుంది. విష్ణుకుండినులలో 11 అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాల గొప్పవాడు. ఇతడు వాకాటకుల తో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు.


విష్ణుకుండినుల వంశావళిని ప్రకారము క్రీ. శ. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (క్రీ. శ.400-422), మొదటి గోవిందవర్మ (క్రీ. శ.422-462), రెండవ మాధవవర్మ (క్రీ. శ.462-502), మొదటి విక్రమేంద్రవర్మ (క్రీ. శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (క్రీ. శ.527-555), రెండవ విక్రమేంద్రభట్టారక (555-572) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ క్రీ. శ. 613 వరకు పాలించాడు.

విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పశ్చిమాన మహబూబ్‌నగర్ జిల్లా లోని కొల్లాపూర్ వరకును, నైరుతిన రంగారెడ్డి జిల్లాలోని కీసర వరకు విస్తరించి ఉన్నది. కీసరలో ఉన్న కేసరి రామలింగేశ్వరాలయం ఈ కాలంనాటిదే. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే.

విభాగాలు: విష్ణుకుండిన రాజ్యం, తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, దక్షిణ భారతదేశ చరిత్ర,


 = = = = =


Tags: Telangana History, Andhra Pradesh History, South Indian History, Mahabubnagar District History, Nalgonda District History, Rangareddy District History, Guntur District History,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక