17, మార్చి 2015, మంగళవారం

రామగిరి ఖిల్లా (Ramagiri Fort)

రామగిరి ఖిల్లా
గ్రామముబోగంపేట
మండలముకమాన్‌పూర్
జిల్లాకరీంనగర్
రామగిరి ఖిల్లా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో ఒక ఎత్తయిన పర్వతంపై ఉంది. ఇది తెలంగాణలో అతి పెద్ద శతృదుర్భేధ్యమైన కోటలలో ముఖ్యమైనది. రామగిరి పర్వతంపై ఉన్న ఈ కోటపై శ్రీసీతారామ ఆలయం ఉంది. వనవాసం సమయంలో శ్రీరాముడు ఈ పర్వతంపై కాలుమోపినట్లు కథనం ప్రచారంలో ఉంది. ఈ కోట పరిసరాలలో పూర్వం మునులు తపస్సులు చేసినట్లు ఆధారాలు లభించాయి. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం, శ్రీరాముని మరియు సీతమ్మవారి పాద చిహ్నాలు కొండపై నిపిస్తాయి.

ఈ ఖిల్లా అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. ఆహ్లదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు పర్యాటకులను అలరిస్తు విరాజిల్లుతోంది. 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది.

చరిత్ర:
రామగిరి దుర్గం
క్రీశ 1వ శతాబ్దంలో రామగిరి కోటను నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నాడు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు తెలుపుతున్నాయి. అనంతరం 1442 లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా వారి నుంచి రెడ్డి రాజులు, అటుపిమ్మట 1595లో మొఘలాయిల అధీనంలోకి వెళ్లింది. వారి నుండి మహమ్మదీయులు వశపరుచు కొన్నారు. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది. రాజులపాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బోగంపేట మారింది.


విభాగాలు: పెద్దపల్లి జిల్లా పర్యాటక ప్రాంతాలు, కమాన్‌పూర్ మండలం, తెలంగాణ కోటలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక