25, మార్చి 2015, బుధవారం

శశి కపూర్ (Shashi Kapoor)

శశి కపూర్
జననంమార్చి 18, 1938
జన్మస్థానంకోల్‌కత
రంగంనటుడు, దర్శకుడు, నిర్మాత
గుర్తింపులుదాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్, జాతీయ ఉత్తమ నటుడు,
ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరుపొందిన శశి కపూర్ మార్చి 18, 1938న కలకత్తా (ఇప్పటి కోల్‌కత)లో జన్మించారు. 160 సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, ఉత్తమ నిర్మాత అవార్డు, భారత ప్రభుత్వం నుంచి పస్మభూషణ్ పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఈయన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ మరియు సోదరుడు రాజ్ కపూర్ కూడా దాసా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు.

సినీ ప్రస్థానం:
శశి కపూర్ నాలుగు సంవత్సరాల పిన్న వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ తో పాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించాడు.1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. శశి కపూర్ హీరోగా నటించిన తొలిచిత్రం ధర్మపుత్ర 1961లో విడుదలైంది. చివరిచిత్రం సైడ్ స్ట్రీట్స్. మొత్తం 160 చిత్రాలలో నటించారు. ఇందులో 148 హిందీ చిత్రాలు కాగా 12 ఆంగ్ల చిత్రాలు.

గుర్తింపులు:
ఈయన చిత్రరంగంలో నటనకు గాను 3 జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. 1979లో జునూన్ చిత్రానికిగాను ఉత్తమ నిర్మాత అవార్డు పొందగా, 1986లో న్యూఢిల్లీ టైమ్స్ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు స్వీకరించారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పొందారు. 2014 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
శశి కపూర్ జనరల్ నాలెడ్జి

కుటుంబం:
కపూర్ కుటుంబం సినిమారంగంలో పేరుపొందింది. కపూర్ కుటుంబానికి చెందిన ముగ్గురికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, సోదరులు రాజ్ కపూర్, షమ్మీకపూర్ ప్రముఖ నటులుగా వెలుగినవారే. భార్య జెన్నిఫర్ కూడా నటిగా రాణించింది.

విభాగాలు: సినిమా నటులు, 1938లో జన్మించినవారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక