25, మార్చి 2015, బుధవారం

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి (Kappagantula Lakshmana Sastry)

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి
(1911-1980)
స్వస్థలంవనపర్తి
రంగంసాహితీ పండితుడు
బిరుదులుఆంధ్రబిల్హణ
సాహితీలోకంలో ఉద్ధండ పండితుడు, ఆంధ్రబిల్హణ బిరుదాంకితుడు అయిన కప్పగంతుల లక్ష్మణశాస్తి వనపర్తిలోజూలై 1911లో జన్మించారు. కర్నూలు, తిరుపతి, మద్రాసులలో అభ్యసించి వనపర్తిలో ఉపాధ్యాయులుగా జీవనం ఆరంభించారు. అష్ట్రభాషా పండితుడైన లక్ష్మణశాస్త్రి పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈయన నుంచి పలు భాషలు నేర్చుకొని హైదరాబాదులోని సిటీ కళాశాలలో ఉద్యోగం కల్పించారు. ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు కూడా లక్ష్మణశాస్త్రి వద్ద అభ్యసించారు.

ఈయన సంస్కృత పాండిత్యం అపారమైనది. కాశీ హిందూవిశ్వవిద్యాలయం సంస్కృత విభాగం వారు లక్ష్మణశాస్త్రిని మహామహోపాధ్యాయ బిరుదంతో సన్మానించారు. బిల్హణుని విక్రమార్క చరితాన్ని తెలుగులో అనువాదం చేసినందుకు తిరుపతి కవితా సమితి వారు ఆంధ్రబిల్హణ బిరుదాన్ని ప్రధానం చేశారు. తర్క, మీమాంస శాస్త్రాలలో కూడా ఈయన తన సమకాలీకులలో అగ్రగణ్యుడు. 79 సంవత్సరాల వయస్సులో జనవరి 10, 1980న కప్పగంతుల మరణించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రచయితలు, తెలంగాణ సాహితీవేత్తలు, వనపర్తి మండలము, 1911లో జన్మించినవారు, 1980లో మరణించినవారు,


 = = = = =


2 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక