11, మే 2015, సోమవారం

సూరత్ జిల్లా (Surat District)

రాష్ట్రంగుజరాత్
వైశాల్యం4,418 చకిమీ
జనాభా60,79,231
తాలుకాలు10
సూరత్ జిల్లా గుజరాత్‌లోని 33 జిల్లాలలో ఒకటి. కాంబే సింధూశాఖ సరిహద్దులో ఉన్న ఈ జిల్లా గుజరాత్‌లో అహ్మదాబాదు తర్వాత రెండో అత్యధిక జనాభా కలిగిన జిల్లా. వజ్రాల పరిశ్రమకు పేరుపొందిన సూరత్ నగరం ఈ జిల్లా రాజధాని. 8వ నెంబరు మరియు 6వ నెంబరు జాతీయ రహదారులతో పాటు ముంబాయిని కలిపే ప్రధాన రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. తాపి నది జిల్లా గుండా ప్రవహించి కాంబే సింధూశాఖలో కలుస్తున్నది. జిల్లా వైశాల్యం 4,418 చకిమీ మరియు 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 60,79,231. 2007లో సూరజ్ జిల్లాను విభజించి తాపి జిల్లాను కొత్తగా ఏర్పాటుచేశారు. రచయితలు నర్మదాశంకర్ దావె, నావల్రామ్‌ ఈ జిల్లాకు చెందినవారు. జిల్లాలో 10 తాలుకాలు, 729 గ్రామాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
సూరత్ జిల్లాకు తూర్పున తాపి జిల్లా, పశ్చిమాన అరేబియా సముద్రంలో భాగమైన కాంబే సింధూశాఖ ఉంది. ఉత్తరాన బారుచ్ జిల్లా, నర్మదా జిల్లాలు, దక్షిణాన నవసాహి జిల్లా, ది డాంగ్స్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
చారిత్రక ప్రాశస్త్యం కలిగియున్న జిల్లా కేంద్రమైన సూరత్ పట్టణం మహాభారత కావ్యంలో కూడా పేర్కొనబడింది. క్రీ.శ.8వ శతాబ్దిలో పార్శీలు ఈ ప్రాంతానికి వచ్చారు. 16వ శతాబ్దిలో పోర్చుగీసువారు సూరత్‌ ఓడరేవు కేంద్రంగా వాణిజ్యం కొనసాగించారు. 17వ శతాబ్దిలో ఆంగ్లేయులు కూడా ఈ ప్రాంతంపై కన్నువేశారు. ఈస్టిండియా కంపెనీ బొంబాయిని అభివృద్ధి పర్చేవరకు పశ్చిమతీరంలో సూరత్ ప్రాధాన్యత కోనసాగింది. స్వాతంత్ర్యానంతరం బొంబాయి రాష్ట్రంలో ఉండి 1960లో గుజరాత్ అవతరణ అనంతరం ఈ రాష్ట్రంలో భాగంగా మారింది. 2011లో సూరత్ జిల్లాను రెండుగా విభజించి తూర్పున తాపి జిల్లాను కొత్తగా ఏర్పాటుచేశారు.

సూరత్ నగరం
జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 60,79,231. జనసంఖ్యలో గుజరాత్‌లో రెండో స్థానంలోనూ, దేశంలో 12వ స్థానంలోనూ ఉంది. జిల్లా జనసాంద్రత 1,376. 2001-2011 దశాబ్దిలో జనాభా పెరుగుదల రేటు 42.19%. స్త్రీ-పురుష నిష్పత్తి 788/1000. అక్షరాస్యత శాతం 86.5%.


ఇవి కూడా చూడండి:
  • సూరత్ నగరం,
  • సూరత్ లోకసభ నియోజకవర్గం,


విభాగాలు: గుజరాత్ రాష్ట్రపు జిల్లాలు, సూరత్ జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక