4, జూన్ 2015, గురువారం

లాతూర్ జిల్లా (Latur District)

రాష్ట్రంమహారాష్ట్ర
వైశాల్యం7,157 చకిమీ
జనాభా24,55,543 (2011)
లాతూర్ జిల్లా మహారాష్ట్రలోని 38 జిల్లాలలో ఒకటి. మహారాష్ట్ర దక్షిణంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ జిల్లా 7,157 చకిమీ వైశాల్యాన్ని, 2011 లెక్కల ప్రకారం 24,55,543 జనాభాను కలిగియుంది. జిల్లా గుండా మంజీరానది ప్రవహిస్తున్నది. వికారాబాదు నుంచి పర్భని వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. సెప్టెంబరు 30, 1993న జిల్లా కేంద్రం భూకంపం వల్ల భారీగా నష్టపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్, బాలీవుడ్ నటుడు రీతేశ్ దేశ్‌ముఖ్ ఈ జిల్లాకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న ఈ జిల్లా 17°52' నుంచి 18°50' ఉత్తర అక్షాంశం, 76°18' నుంచి 79°12' తూర్పు రేఖాంశం మధ్యలో సముద్ర మట్టానికి 631 మీటర్ల ఎత్తులో బాలాఘాట్ పీఠభూమిలో భాగంగా ఉంది. ఈ జిల్లాకు ఈశాన్యాన నాందేడ్ జిల్లా, తూర్పున మరియు ఆగ్నేయాన కర్ణాతక రాష్ట్రం, నైరుతిన ఉస్మానాబాదు జిల్లా పశ్చిమాన బీడ్ జిల్లా, వాయువ్యాన పర్భని జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
లాతూర్ పురాతనమైన చరిత్రను కలిగియుంది. రాష్ట్రకూట తొలి పాలకుడు దంతిదుర్గుని లట్టలూరు ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహనులు, శకులు, చాళుక్యులు, దేవగిరి యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీలు, ఆదిల్‌షాహీలు, మొఘలులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 17వ శతాబ్దిలో హైదరాబాదు రాజ్యంలో భాగమైంది. 1905లో ఉస్మానాబాదు జిల్లాలో భాగమైన ఈ ప్రాంతం 1948లో నిజాం పాలన నుంచి బయటపడి భారతదేశంలో కలిసింది. 1948 నుంచి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, ఆ తర్వాత ముంబాయి రాష్ట్రంలో ఉండి 1960లో మహారాష్ట్రలో భాగమైంది.

ఉద్గీర్ కోట
జనాభా:
2001 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 20,80,285. దశాంది కాలంలో 18.04% వృద్ధి చెంది 2011 నాటికి జిల్లా జనాభా 24,55,543కు పెరిగింది. దేశంలోని 640 జిల్లాలలో ఇది 181వ స్థానంలో ఉంది. జనసాంద్రత 343, అక్షరాస్యత శాతం 79.03%, స్త్రీ-పురుష నిష్పత్తి 924/1000. లాతూర్, ఉద్గీర్, ఔసా, నీలాంగ, అహ్మద్‌పూర్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు. 

రవాణా సౌకర్యాలు:
వికారాబాదు నుంచి పర్భని వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. జిల్లాలో 7 తాలుకాలు ఉన్నాయి. చాకుర్ నుంచి లాతూర్ మీదుగా మరో రైలుమార్గం ఉంది. జిల్లా గుండా జాతీయ రహదారి లేకున్ననూ దక్షిణాన ఉన్న ఉస్మానాబాదు జిల్లా మీదుగా 2 జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. 9వ నెంబరు జాతీయ రహదారి ఈ జిల్లా దక్షిణ అంచును తాకుతూ వెళ్ళుచున్నది.

విభాగాలు: మహారాష్ట్ర జిల్లాలు, లాతూర్ జిల్లా, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక