22, జులై 2015, బుధవారం

కర్రెద్దుల కమలకుమారి (Karreddula Kamala Kumari)

జననంఆగస్టు 8, 1950
రంగంరాజకీయాలు
పదవులు2 సార్లు ఎంపి, కేంద్రమంత్రి,
మరణంజూలై 17, 2014
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన కర్రెద్దుల కమలకుమారి ఆగస్టు 8, 1950న జన్మించింది. లక్కవరంకు చెందిన కమలకుమారి ప్రారంభంలో హాస్టల్ మ్యాట్రన్‌గా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి భర్త ప్రోత్సాహంతో రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు లోకసభకు ఎన్నిక కావడమే కాకుండా కేంద్రమంత్రిగానూ పనిచేసింది. జూలై 17, 2014న మరణించింది.

రాజకీయ ప్రస్థానం:
1984లోనే భద్రాచలం లోకసభ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిననూ అప్పటికే 4 సార్లు ఎంపి అయిన రాధాబాయికే టికెట్ లభించింది. ఆ తర్వాత 1989లో భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించి తొలిసారి లోకసభలో ప్రవేశించారు. 1991లో మళ్ళీ అదేస్థానం నుంచి రెండోసారి ఎన్నికై పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో చోటుపొందారు. 1996, 1998లలో భద్రాచలం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిననూ సోడె రామయ్య చేతిలో ఓడిపోయారు.

బంధుత్వం:
ఈమె కుమారుడు అనిల్ కుమార్ కూడా రాజకీయాలలో ఉన్నారు. గతంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీగా పనిచేశారు.

విభాగాలు: పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ నాయకులు, భద్రాచలం లోకసభ నియోజకవర్గం, కేంద్రమంత్రులు, 1950లో జన్మించినవారు, 9వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక