జాజిరెడ్డిగూడెం సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు, xx గ్రామపంచాయతీలు కలవు. తెలంగాణకు చెందిన ప్రముఖ జలనిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలం పశ్చిమ సరిహద్దులో మూసీనది ప్రవహిస్తోంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 40878, 2011 నాటికి జనాభా 172 పెరిగి 41050 కు చేరింది 2001 జనాభా ప్రకారము జిల్లాలో 45వ స్థానంలో ఉండగా 2011 నాటికి 49వ స్థానానికి దిగజారింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41050. ఇందులో పురుషులు 20594, మహిళలు 20456. చరిత్ర: 2016 అక్టోబరు 11న తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఫలితంగా ఈ మండలం నల్గొండ జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో కలిసింది. మండలంలో 15 రెవెన్యూ గ్రామాలుండగా 3 గ్రామాలు కొత్తగా ఏర్పడిన నాగారం మండలంలోకి వెళ్ళగా ప్రస్తుతం మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు మిగిలాయి. రాజకీయాలు: ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని గ్రామాలు: పర్సాయిపల్లి (Parsaipally), బొల్లంపల్లి (Bollampally), జాజిరెడ్డిగూడెం (Jajireddygudem), కేసారం (Kesaram), ఉయ్యాలవాడ (Uyyalavada), కుంచమర్తి (Kunchamarthy), తిమ్మాపూర్ (Timmapur), అడివెముల (Adivemla), వేల్పుచెర్ల (Velpucherla), కాసర్లపహాడ్ (Kasarlapahad), కొమ్మల (Kommala), కోడూర్ (Kodoor), జాజిరెడ్డిగూడెం (Jajireddygudem): జాజిరెడ్డిగూడెం సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండలకేంద్రము. ప్రముఖ జలనిపుణుడు ఆర్.విద్యాసాగర్ రావు ఈ గ్రామానికి చెందినవారు.
= = = = =
|
Tags: Suryapet District Mandals in Telugu, Suryapet Dist Mandals information, About Suryapet Dist Mandals, Jajireddy Gudem Mandal information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి