16, జూన్ 2013, ఆదివారం

భువనగిరి లోకసభ నియోజకవర్గం (Bhuvanagiri Loksabha Constituency)

భువనగిరి లోకసభ నియోజకవర్గం
జిల్లాఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వరంగల్
ప్రస్తుత ఎంపికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పార్టీకాంగ్రెస్ పార్టీ


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2017లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 కె.రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 నర్సయ్యగౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కె.రాజగోపాలరెడ్డి తన సమీప ప్రత్యర్థి, మహాకూటమి తరఫున పోటీచేసిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డి 504103 ఓట్లు పొందగా, నోముల నర్సింహయ్యకు 364215 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గడ్డం చంద్రమౌళి 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీహెచ్ సాంబమూర్తి 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 15 అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒక నామినేషన్ తిరస్కరించబడింది. ఒకరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 13 అభ్యర్థులు మిగిలారు. తెరాసకు చెందిన నర్సయ్యగౌడ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాలరెడ్డిపై 30532 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన బూర నర్సయ్యగౌడ్ పై 5219ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 532795ఓట్లు రాగా, తెరాస అభ్యర్థికి 527576ఓట్లు వచ్చాయి. భాజపాకు చెందిన పడాల వెంకట శ్యాంసుందర్ రావు 65457 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: నల్గొండ జిల్లా నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు, వరంగల్ జిల్లా నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక