పదర నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది.అంతకు క్రితం అమ్రాబాదు మండలంలో ఉన్న 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. వంకేశ్వరంలో ఓంకారేశ్వరం, మద్దిమడుగులో కాశీవిశ్వేశ్వరాలయం, పదరలో పరశురామేశ్వరాలయం, మారడుగులో మార్కండేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. మద్దిమడుగు సమీపంలో 2500 సంవత్సరాల క్రితం నాటి సమాధులు బయటపడ్డాయి.
సరిహద్దులు: ఈ మండలము జిల్లాలో ఆగ్నేయాన ఉంది. ఈ మండలానికి ఉత్తరాన అమ్రాబాదు, అచ్చంపేట, లింగాల్, బల్మూరు మండలాలు, పశ్చిమాన కొల్లాపూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. రాజకీయాలు: పదర మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాలరేఖ:
పదర (Padara), వంకేశ్వరం (Vankeshwaram), ఉడిమిల్ల (Udimilla), ఇప్పలపల్లి (Ippalapalle), మారెడూగు (Maredugu), గంగుపెంట (Gangupenta), మద్దిమడుగు (Maddimadugu),
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Padara mandal in Telugu, Nagarkurnool Dist Mandals information in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి