జిల్లెల చిన్నారెడ్డి | |
జననం | జూన్ 1, 1955 |
స్వస్థలం | జయన్న తిర్మలాపురం |
జిల్లా | వనపర్తి జిల్లా |
పదవులు | 3సార్లు ఎమ్మెల్యే, పిసిసి ఉపాధ్యక్షుడు, ఏఐసిసి కార్యదర్శి |
నియోజకవర్గం | వనపర్తి అ/ని, |
జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1955, జూన్ 1న జన్మించిన చిన్నారెడ్డి స్వస్థలం గోపాలపేట మండలం జయన్న తిర్మలాపురం గ్రామం. ఇతను వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. చిన్నారెడ్డి హైస్కూలు వరకు వనపర్తిలో విద్యనభ్యసించారు. 1970లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు.
రాజకీయ నేపథ్యం
చిన్నారెడ్డి విద్యార్థి దశలోనే విద్యార్థిసంఘం నాయకుడిగా ఉన్నారు. హైదరాబాదులో బిఎస్సీ (అగ్రికల్చర్) అభ్యసిస్తున్నప్పుడే ఎన్.ఎస్.యు.ఐ.నాయకుడిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడే రాజకీయాలపై దృష్టిపెట్టి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1985లో తొలిసారి కాంగ్రెస్ తరఫున వనపర్తి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1989లో బాలకృష్ణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 1994లో మూడవసారి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ చేతిలో పరాజయం పొందినారు. ఆ తర్వాత 1999, 2004లలో వనపర్తి నుంచి వరస విజయాలు సాధించారు. 2009లో వరసగా 6వ సారి వనపర్తి నుంచి పోటీచేశారు కాని విజయం లభించలేదు. మొత్తంపై 3 సార్లు విజయం, మరో 3 సార్లు పరాజయం పొందినారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2004లో విజయం సాధించిన పిమ్మట వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్ గా కూడా పనిచేశారు. 2013, జూన్ 9న జి.చిన్నారెడ్డికి పిసిసి ఉపాధ్యక్ష పదవి లభించింది. జూన్ 16, 2013న ఏఐసిసి కార్యదర్శి పదవిలో నియమించబడ్డారు. జిల్లా నుంచి ఈ పదవి పొందిన రెండవ నాయకుడు చిన్నారెడ్డి.

విభాగాలు: వనపర్తి జిల్లా ప్రముఖులు, గోపాలపేట మండలము, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 1955, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి