23, జనవరి 2013, బుధవారం

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (Kalwakurthy Assembly Constiuency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్జిల్ మండలం జడ్చర్ల నియోజకవర్గంలో కలిసింది. అచ్చంపేట నియోజకవర్గంలోని కల్వకుర్తి మండలానికి చెందిన 14 గ్రామాలు ప్రస్తుతం ఇందులో కలియడంతో కల్వకుర్తి మండలం పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంలో భాగమైంది. 1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించారు. శాంతాబాయి, చిత్తరంజన్ దాస్, ఎడ్మ కిష్టారెడ్డిలు రెండేసి సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు.ప్రముఖ సమరయోధుడు, రచయితగా పేరుపొందిన మాజీ మంత్రి మందుముల నరసింగరావు 1952లో ఇక్కడి నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

(కల్కకుర్తి శాసనసభ నియోజకవర్గం)
(చిత్రం: తెవికీ సౌజన్యంతో - సభ్యుడు దేవా)
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 ముందుముల నర్సింగరావు కాంగ్రెస్ ఎల్.వెంకట్ రెడ్డి పి.పి
కె.ఆర్.వీరాస్వామి కాంగ్రెస్ ఎస్.బాబయ్య స్వతంత్ర అభ్యర్థి
1957 టి.శాంతాబాయి కాంగ్రెస్ మైసయ్య స్వతంత్ర అభ్యర్థి
కె.నాగన్న కాంగ్రెస్ బాలడు పి.డి.ఎఫ్
1962 ఎల్.వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ
1964 టి.శాంతా బాయి కాంగ్రెస్ పార్టీ జి.ఎం.రెడ్డి సి.పి.ఐ.
1967 డి . గోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ
1969 ఎస్.జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.ఎస్.రెడ్డి ఎస్టీపీఎస్
1972 ఎస్.జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.ఎస్.రెడ్డి ఎస్టీపీఎస్
1978 ఎస్.జైపాల్ రెడ్డి జనతా పార్టీ కె.కమలా కాంతారావు కాంగ్రెస్ పార్టీ
1983 ఎస్.జైపాల్ రెడ్డి జనతా పార్టీ బి.రుక్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 జె.చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ డి.లింగారెడ్డి జనతాపార్టీ
1989 జె. చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ
1994 ఎడ్మ కిష్టారెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1999 జి.జైపాల్ యాదవ్ తెలుగుదేశం ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 ఎడ్మ కిష్టా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ
2009 జైపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లోజు ఆచారి భారతీయ జనతా పార్టీ
2018 గుర్కా జైపాల్ యాదవ్ తెరాస తల్లోజు ఆచారి భాజపా

1952 ఎన్నికలు:1952లో జరిగిన తొలి ఎన్నికలలో ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడి నుంచి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ప్రముఖ సమరయోధుడు, రచయిత మందుముల నరసింగరావు మరియు కె.ఆర్.వీరస్వామి ఈ నియోజకవర్గ తొలి శాసనసభ్యులుగా హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

1957 ఎన్నికలు:1957లో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒకటవ నెంబరు సంఖ్య కల నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఇది ద్విసభ్య నియోజకవర్గం. అందులో ఒకటి ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ రిజర్వ్ నుంచి డా.నాగన్న విజయం సాధించగా, జనరల్ నుంచి శాంతాబాయి విజయం సాధించారు.

1962 ఎన్నికలు:
1962లో ఇక్కడి నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతాబాయిపై 821 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వెంకటరెడ్డికి 1184 ఓట్లు రాగా, శాంతాబాయికి 10463 ఓట్లు వచ్చాయి.

1964 ఉప ఎన్నికలు:
1964 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి శాంతాబాయి సిపీఐ కు చెందిన జి.ఎం.రెడ్డిపై విజయం సాధించారు.

1967 ఎన్నికలు:
1967 ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసి డి.గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శాంతాబాయిపై 4743 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గోపాలరెడ్డి 19289 ఓట్లు సాధించగా, శాంతాబాయికి 14546 లభించాయి.

1972 ఎన్నికలు:
1972 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సూదిని జైపాల్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఎస్టీఎస్ కు చెందిన బి.సత్యనారాయణరెడ్డిపై 9811 ఓట్ల ఆధిక్తతతో గెలుపొందినారు.జైపాల్ రెడ్డి 30426 ఓట్లు పొందగా, సత్యనారాయణరెడ్డి 20615 ఓట్లు సాధించారు.

1978 ఎన్నికలు:
1972 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జైపాల్ రెడ్డి 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలాకాంతారావుపై 13380 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. జైపాల్ రెడ్డి 36544 ఓట్లు పొందగా, కమలాకాంతారావు 23164 ఓట్లు పొందారు.

1983 ఎన్నికలు:
1983 ఎన్నికలలో సూదిని జైపాల్ రెడ్డి మరోసారి జనతాపార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుక్మారెడ్డిపై 17461 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. జైపాళ్ రెడ్డి 46045 ఓట్లు పొందగా, రుక్మారెడ్డి 28584 ఓట్లు సాధించారు.

1985 ఎన్నికలు:
1985 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ తన సమీప ప్రత్యర్థి జనతాపార్టీ అభ్యర్థి డి.లింగారెడ్డిపై 9438 ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. చిత్తరంజన్ దాస్‌కు 37192 ఓట్లు రాగా, లింగారెడ్డి 27754 ఓట్లు పొందినారు.

1989 ఎన్నికలు:
1989 ఎన్నికలలో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీరామారావు 3 చోట్ల పోటీచేయగా, అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ నియోజకవర్గం ఎన్నుకున్నారు. కాని అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో 3568 ఓట్ల తేడాతో పరాజయం పొందినారు. ఎన్.టి.రామారావు రాజకీయ జీవితంలో ఇదే ఏకైక ఓటమి. చిత్తరంజన్ దాస్ 54354 ఓట్లు పొందగా, రామారావుకు 50786 ఓట్లు లభించాయి. ఈ సంచలన విజయంతో చిత్తరంజన్ దాస్ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు.

1994 ఎన్నికలు:
1994 ఎన్నికలలో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి సమీప ప్రత్యర్థి ఇండిపెండెంటుగా పోటిచేసిన డి.గోపాల్ రెడ్డిపై 1259 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిష్టారెడ్డికి 38992 ఓట్లు, గోపాలరెడ్డికి 37733 ఓట్లు లభించాయి.

1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యడ్మ కిష్టారెడ్డిపై 3403 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జైపాల్ యాదవ్ 63995 ఓట్లు పొందగా, యడ్మ కిష్టారెడ్డికి 6592 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం ఆరుగురు ఉండగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. మొగితా నలుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యడ్మ కిష్టారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 22117 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. యడ్మ కిష్టారెడ్డికి 76152 ఓట్లు రాగా, ఆచారి 54035 ఓట్లు పొందినారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున టి.ఆచారి, కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి,. ప్రజారాజ్యం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, లోక్‌సత్తా నుండి బండెల రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున జైపాల్ యాదవ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన వంశీచంద్ తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతాపార్టీకి చెందిన తల్లోజు ఆచారిపై స్వల్ప తేడాతో గెలుపొందినారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భాజపాకు మద్దతు ఇచ్చింది.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున జైపాల్ యాదవ్, భాజపా తరఫుమ తల్లోజు ఆచారి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా వంశీచంద్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన గుర్కా జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన తల్లోజు ఆచారి పై 3447 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గ ప్రముఖులు
 • ముందుముల నర్సింగరావు: 1952లో తొలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు.
 • కె.ఆర్.వీరాస్వామి: 1952లో ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు.
 • టి.శాంతాబాయి: 1957లో ఇండిపెండెంటుగా 1964లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1962, 67లలో ఓటమి చెందారు.
 • కె.నాగన్న: 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. మరో 3 సార్లు మిగితా నియోజకవర్గాలలో పోటీచేసి గెలుపొందినారు.
 • ఎల్.వెంకట్ రెడ్డి: 1962లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు.
 • డి . గోపాల్ రెడ్డి: 1967లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచారు.
 • ఎస్.జైపాల్ రెడ్డి: 1969, 1972లలో కాంగ్రెస్ పార్టీ తరఫున, 1978, 1983లలో జనతా పార్టీ తరఫున గెలుపొందినారు. ఆ తర్వాత 3 సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.
 • చిత్తరంజన్ దాస్:1985, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1989లో తెలుగుదేశం పర్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావుపై విజయం సాధించి సంచలనం సృష్టించారు.
 • ఎడ్మ కిష్టారెడ్డి: 1994లో ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం, 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి, 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం, 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు.
 • జైపాల్ యాదవ్: 1999, 2009లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందినారు.
 • ఎస్.బాబయ్య:
 • మైసయ్య:
 • బాలడు:
 • జి.ఎం.రెడ్డి:
 • బి.సత్యనారాయణరెడ్డి:
 • కె.కమలా కాంతారావు:
 • బి.రుక్మారెడ్డి:
 • డి.లింగారెడ్డి:
 • ఎన్.టి.రామారావు:
 • డి.గోపాల్ రెడ్డి:
 • టి.ఆచారి: 1999, 2004, 2009లలో భాజపా తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2004, 2014లలో రెండోస్థానం పొందారు.
 •  

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం,  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక