24, జనవరి 2013, గురువారం

మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ (Mahabubnagar Revenue Division)

మహబూబ్ నగర్ జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 19 మండలాలు, 471 రెవెన్యూ గ్రామాలు, 431 గ్రామపంచాయతీలు కలవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 13,51,269. ఈ డివిజన్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోకసభ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో 3 పురపాలక సంఘాలు కూడా ఉన్నాయి. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ జిల్లాలోనే పెద్దది. మహబూబ్ నగర్ పట్టణంలో కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలోనే ఆర్డివో కార్యాలయం ఉంది.
డివిజన్ పరిధిలోని మండలాలు

అడ్డకల్
ఆమనగల్
కల్వకుర్తి
కేశంపేట
కొందుర్గ్‌
కొత్తూరు
కోయిలకొండ
జడ్చర్ల
తలకొండపల్లి
నవాబ్ పేట
బాలానగర్
భూత్‌పూర్‌
మహబూబ్ నగర్
మాడ్గుల్
మిడ్జిల్
వంగూరు
వెల్దండ
షాద్‌నగర్
హన్వాడ


జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ జనాభా 13,51,269. ఇందులో పురుషులు 6,86,568 కాగా, మహిళలు 6,64,701. డివిజన్ లో పట్టణ జనాభా 3,44,742 మరియు గ్రామీణ జనాభా 10,06,527. అత్యధిక జనాభా కల మండలం మహబూబ్ నగర్ మండలం కాగా, అత్యల్ప జనాభా కల మండలం కేశంపేట.
నియోజకవర్గాలు
ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. అలాగే 2 లోకసభ నియోజకవర్గాలలో వ్యాపించియుంది.అసెంబ్లీ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు
 • అచ్చంపేట(1 మండలం)
 • దేవరకద్ర (2 మండలాలు)
 • జడ్చర్ల (4 మండలాలు)
 • కల్వకుర్తి (5 మండలాలు)
 • మహబూబ్ నగర్ (2 మండలాలు)
 • నారాయణపేట (1 మండలం)
 • షాద్ నగర్ (4 మండలాలు)
 • మహబూబ్ నగర్ (13 మండలాలు}
 • నాగర్ కర్నూల్ (6 మండలాలు)
విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు,    ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక