మరాఠి చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1967, జూన్ 24 న జన్మించారు. బి.ఎ., ఎల్.ఎల్.బి. వరకు అభ్యసించారు. ధన్వాడ మండల అధ్యక్షులుగా, సోదరుడు ఎర్రసత్యం మరణానంతరం జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైనారు.
రాజకీయ జీవనం ఎర్రశేఖర్‌గా పిలువబడే మరాఠి చంద్రశేఖర్ తొలిసారిగా సోదరుడు ఎర్రసత్యం మరణంతో ఖాళీ అయిన జడ్చర్ల స్థానం నుంచి 1996 ఉపఎన్నికలలో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. అంతకి ముందు 1995లో ధన్వాడ ఎంపిపిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో కూడా విజయం సాధించి వరుసగా రెండో సారి శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చేతిలో ఓడిపోగా, 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై పోటీచేసి పరాజయం పొందినారు. 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి జడ్చర్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిననూ డిపాజిట్ లభించలేదు. ఆగస్టు 2019లో భాజపాలో చేరి మే 2020లో భాజపా మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడైనారు. ఇవి కూడా చూడండి:
(ఈ సమాచారం జూన్ 1, 2020 నాటికి తాజాకరించబడింది)
|
28, జనవరి 2013, సోమవారం
ఎం.చంద్రశేఖర్ (M.Chandra Sekhar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి