తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలో ఉన్నది. ఇది జిల్లాలోనే అతి ఉత్తరాన ఉన్న రైల్వేస్టేషన్. దక్షిణమధ్యరైల్వే జోన్ లోని హైదరాబాదు డివిజన్ లో భాగంగా సికింద్రాబాదు-డోన్ మార్గంలో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 45 కిమీ, డోన్ నుంచి 252 కిమీ దూరంలో ఉంది. తిమ్మాపూర్ స్టేషన్ ఉందానగర్ మరియు కొత్తూర్ (హాల్ట్) స్టేషన్ల మధ్యన ఉందానగర్ నుంచి17 కిమీ, కొత్తూరు నుంచి 2 కిమీ దూరంలో ఉన్నది. ఇక్కడ రైల్వే టర్మినల్ నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నది. టర్మినల్ వల్ల ఈ స్టేషన్ మరియు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ స్టేషన్ నుంచి రోజూ 16 రైళ్ళు (రాను పోను కలిపి) వచ్చిపోతుంటాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, కొత్తూరు మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి