శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ (హాల్ట్) రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై మానోపాడు మండలంలో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 234 కిమీ, డోన్ నుంచి 64 కిమీ దూరంలో ఉన్నది. ఇది మానోపాడ్ స్టేషన్ మరియు ఆలంపూర్ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. జోగులాంబ స్టేషన్ మానొపాడ్ నుంచి 14 కిమీ, ఆలంపూర్ రోడ్ నుంచి 2 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 8 రైళ్ళు (తుంగభద్ర ఎక్స్ ప్రెస్ మినహా అన్నీ పాసింజర్ రైళ్ళు ) మాత్రమే ఆగుతాయి. 2006 ఏప్రిల్ 10న ఈ స్టేషన్ (హాల్ట్) ప్రారంభించబడింది. తుంగభద్ర పుష్కరాల సందర్భం నుంచి ఇక్కడ తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలును నిలుపుతున్నారు. ఆలంపూర్ దేవస్థానం వెళ్ళు భక్తులకు ఈ స్టేషన్ సౌకర్యంగా ఉంది. ఈ హాల్ట్ జాతీయ రహదారి నుంచి ఆలంపూర్ వెళ్ళు రహదారికి ప్రక్కనే ఉండుటచే రైలు దిగినవారికి బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, మానొపాడు మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి