కోడంగల్ మండలంలో గుల్బర్గా వెళ్ళు రహదారిపై ఉన్న కస్తురుపల్లి గ్రామం రాష్ట్ర సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం. ఈ గ్రామానికి 3కిమీ దూరంలో పేదల మహానందిగా పేరుగాంచిన లొంకబసవన్న వెలసిన క్షేత్రం భక్తులచే విశేష పూజలందుకుంటున్నది. మహానంది వలె ఇక్కడా నంది నోటి నుంచి ఎప్పుడు నీరు ప్రవహిస్తోంది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడకు వచ్చి తపస్సు ఆచరించాడనీ భక్తుల విశ్వాసం. ఇక్కడున ఒక బండరాతిపై ఈశ్వరుని పాదాలున్నట్లు భక్తుల విశ్వాసం. భాషాప్రయుక్త రాష్త్రాలకు ముందు ఈ ప్రాంతం కర్ణాటకలో ఉండటం, ప్రస్తుతం కర్ణాటక సరిహద్దులో ఉండటంచే కర్ణాటక వాసులు ఇక్కడికి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు. మహాశివరాత్రి నాడు భక్తులు అధిక సంఖ్యలో చేరి జాగరణం చేస్తారు.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, కోడంగల్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి