కోటకద్ర రైల్వేస్టేషన్ (హాల్ట్) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో , సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 131కిమీ, డోన్ నుంచి 166 కిమీ దూరంలో ఉన్నది. ఇది మన్యంకొండ స్టేషన్ మరియు దేవరకద్ర రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. కోటకద్ర స్టేషన్ మన్యంకొండ నుంచి 4 కిమీ, దేవరకద్ర నుంచి 6 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ రోజూ రానుపోను కలిపి 8 రైళ్ళు (అన్నీప్యాసింజర్ రైళ్ళు) మాత్రమే ఆగుతాయి. మన్యంకొండ దేవస్థానం వెళ్ళేవారు ఇక్కడ రైలుదిగి నడుచుకుంటూ వెళ్తారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, దేవరకద్ర మండలము, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి