27, మార్చి 2013, బుధవారం

సీతా దయాకర్ రెడ్డి (Seeta Dayakar Reddy)

సీతా దయాకర్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ మహిళా రాజకీయ నేతలలో ఒకరు. నిజామాబాదు జిల్లా సదాశివనగర్‌లో అక్టోబరు 27 1961న జన్మించిన సీతకు కొత్తకోట దయాకర్ రెడ్డితో వివాహం జరిగింది. బీఏ వరకు అభ్యసించిన సీత దయాకర్ రెడ్డి 1994లో రాజకీయ ప్రవేశం చేసి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి ఏకంగా జిలా పరిషత్తు చైర్మెన్ పదవి పొందినారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్ణ సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఈమె మరోసారి దేవరకద్ర నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పొందారు.

బంధుత్వం:
భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో సీత దేవరకద్ర నుంచి ఈమె భర్త కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా మక్తల్ నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. ఒకే శాసనసభకు భార్యాభర్తలు ఎన్నిక కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. సీత తండ్రి కామినేని రామేశ్వరారావు సర్పంచిగా పనిచేశారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు,  చిన్నచింతకుంట మండలము,  మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు చైర్మెన్లు,  దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం13వ శాసనసభ సభ్యులు,
= = = = =
ఉపయుక్త గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • స్థానికపాలన సంచికలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక