11, మార్చి 2013, సోమవారం

మహబూబ్ నగర్ జిల్లా కాలరేఖ (Timeline of Mahabubnagar Dist)

  2000 నుంచి నేటివరకు
 • 2015, జూన్ 10: భూత్పూర్ మండలం కరివెనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబడింది.
 • ఏప్రిల్ 1, 2015: కేంద్రమంత్రి నితిన్ గడ్గరిచే జడ్చర్ల-రాయచూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు మహబూబ్‌నగర్ పట్టణంలో శంకుస్థాపన చేయబడింది
 • 2015, ఫిబ్రవరి 23: పాఠశాల క్రీడాసమాఖ్య 60వ జాతీయ స్థాయి అండర్-14 క్రికెట్ పోటీలు మహబూబ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి.
 • 2015, జనవరు 20: నారాయణపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి మరణించారు. 
 • 2014, డిసెంబరు 16: జడ్చర్ల ఎమ్మెల్యే చెర్లకోల లక్ష్మారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులకు మంత్రిపదవులు లభించాయి.
 • 2014, డిసెంబరు 13: భాజపా తెలంగాణ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జి.పద్మారెడ్డి నియమితులైనారు.
 • 2014, అక్టోబరు 15: మల్డకల్ మండలం నీలిపల్లి గ్రామంలో 1840 కాలం నాటి వెయ్యి వెండి నాణేలు బయటపడ్డాయి.
 • 2014, జూలై 3: పురపాలక సంఘాల చైర్మెన్ల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, తెరాస, భాజపా, తెదేపా ఒక్కో స్థానం సాధించాయి.
 • 2014, జూన్ 13: ఫిడే (అంతర్జాతీయ చదరంగం సమాఖ్యా) రేటింగ్‌లో తొలిసారి జిల్లాకు చెందిన కుమారి శ్రేష్ఠకు స్థానం లభించింది.
 • 2014,మే 17: శాసనసభ స్థానాలలో తెరాస 7 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 5, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు పొందాయి. లోకసభలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానం పొందాయి.
 • 2014, మే 14: మక్తల్ మాజీ ఎమ్మెల్యే నరసింహులు నాయుడు మరణించారు.
 • 2014, మే 13: ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది.
 • 2014, మే 12: పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 1, భాజపా 1 పురపాలక సంఘాలలో విజయం. మహబూబ్‌నగర్‌, వనపర్తిలో హంగ్ ఏర్పడింది.
 • 2014, ఏప్రిల్ 30: జిల్లాలో 2 లోకసభ, 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి.
 • 2014, ఏప్రిల్ 22: భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి యొక్క భారీ బహిరంగ సభ జరిగింది.
 • 2014, మార్చి 7: ప్రముఖ పారిశ్రామికవేత్త బాదాం రామస్వామి మరణించారు.
 • 2014, ఫిబ్రవరి 12: దీపావళి కథానికల పోటీలో జిల్లాకు చెందిన రచయిత్రి కేఏఎల్ సత్యవతికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. 
 • 2014, ఫిబ్రవరి 12: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ద్యాప విజితారెడ్డి నియమితులైనారు.
 • 2014, ఫిబ్రవరి 10: మాజీ మంత్రి చల్లా రాంభూపాల్ రెడ్డి మరణించారు. 
 • 2014, ఫిబ్రవరి 9: రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కేంద్రంలో బసవేశ్వరుడి విగ్రహం ప్రతిష్టించబడింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గేచే.
 • 2014, ఫిబ్రవరి 5: మేకగూడలోని నాట్కోల్యాబ్స్ పరిశ్రమను టాంజేనియా అధ్యక్షుడు సందర్శించారు.
 • 2014, జనవరి 6: తెరాస రాష్ట్ర కార్యదర్శిగా తిమ్మాజీపేట మండలానికి చెందిన జక్క రఘునందన్ రెడ్డి నియమితులైనారు.
 • 2014, జనవరి 7: జాతీయస్థాయి పైకా పోటీలు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. 
 • 2013, డిసెంబరు 14: అయిజ మండలమునకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సుంకన్నగౌడ్ మరణించారు.
 • 2013, నవంబరు 28: పాలమూరు జిల్లాకు చెందిన ఏ.హెచ్.కె.సాగర్ పీసిసి కార్యదర్శిగా నియమితులైనారు.
 • 2013, నవంబరు 17: పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త కోటీశ్వర్ రెడ్డి మరణించారు.
 • 2013, నవంబరు 13: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన శాస్త్రవేత్త డా.వలిపె రాంగోపాలరావుకు 2013 సం.పు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు లభించింది. 
 • 2013, అక్టోబరు 11: గద్వాల-రాయచూర్ నూతన రైలుమార్గం ప్రారంభమైంది.
 • 2013, అక్టోబరు 5: జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్, మాగనూరు మీదుగా వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి జాతీయ రహదారిగా అమలులోకి వచ్చింది.
 • 2013, అక్టోబరు 5: పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖనిర్మాత బసిరెడ్డి ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులైనారు.
 • 2013, సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్‌నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
 • 2013, ఆగస్టు 26: జగన్మోహన్ హత్యకేసులో జడ్చర్ల ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ (ఎర్రశేఖర్) పోలీసుల ఎదుట లొంగిపోయారు.
 • 2013, ఆగస్టు 10: గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ విచ్చేసి ఏపి ఎపికాన్ సదస్సులో పాల్గొన్నారు.
 • 2013, ఆగస్టు 4: స్వాతంత్ర్య సమరయోధుడు ఏదుల రామచంద్రారెడ్డి మరణించారు.
 • 2013, జూలై 23: నారాయణపేట మరియు గద్వాల డివిజన్‌లలో గ్రామ పంచాయతి ఎన్నికల పోలింగ్ జరిగింది.
 • 2013, జూలై 10: నారాయణపేట పట్టణానికి చెందిన హిందుస్థానీ సంగీత విధ్వాంసుడు రాంచందర్ రావు మరణించారు.
 • 2013, జూన్ 25: అచ్చంపేట మేజర్ గ్రామపంచాయతిని నగరపంచాయతిగా మారుస్తూ ఉత్తర్వు జారీ.
 • 2013, జూన్ 25: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యాదయ్య సైన్యంలో విధులు నిర్వహిస్తూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించాడు. 
 • 2013, మే 24: స్వాతంత్ర్య సమరయోధుడు రావిచెట్టు నాగిరెడ్డి మరణం (చెన్నిపాడుకు చెందినవారు)
 • 2013, జూన్ 22: గద్వాలలో 2011 సం.పు టీవి నందుల ప్రధానోత్సవం జరిగింది.
 • 2013, జూన్ 16: జిల్లెల చిన్నారెడ్డికి ఏఐసిసి కార్యదర్శిగా పదవి లభించింది.
 • 2013, జూన్ 12: గ్రామపంచాయతి రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. మొత్తం పంచాయతీలు 1331, ఎస్టీ 151, ఎస్సీ 232, బీసి 324, మహిళలు (అన్ని కేటగేరిలు కలిపి) 665, జనరల్ 482.
 • 2013, జూన్ 9: జిల్లాకు చెందిన జి.చిన్నారెడ్డికి పిసిసి ఉపాధ్యక్ష పదవి లభించింది.
 • 2013, జూన్ 3: నాగం జనార్థన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ నగరా సమితి భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబడింది.
 • 2013, మే 24: స్వాతంత్ర్య సమరయోధుడు రావిచెట్టు నాగిరెడ్డి మరణం (చెన్నిపాడుకు చెందినవారు).
 • 2013, మే 18: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన లైటు ఆంజనేయులు మరణించారు.
 • 2013, ఏప్రిల్ 11: విజయ నామ ఉగాది ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్‌లో జరిగిన సమావేశంలో "పాలమూరు కవితా సుధ" పుస్తకావిష్కరణ జరిగింది. 
 • 2013, మార్చి 24: కల్వకుర్తి ప్రాంతానికి రూ.100 కోట్లతో త్రాగునీటి పథకం, KLI ఉపకాల్వ నిర్మాణానికి కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డిచే శంకుస్థాపన. 
 • 2013 మార్చి 12: ధన్వాడ మండలము మందిపల్లి గ్రామములో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిచే రెవెన్యూ సదస్సులు ప్రారంభించబడింది.
 • 2013 ఫిబ్రవరి 3:మహబూబ్ నగర్ లో జన్మించి హైదరాబాదు మేయరుగా పనిచేసిన సరోజినీ పుల్లారెడ్డి మరణించారు.
 • 2012 డిసెంబరు 21: కడ్తాల్ (ఆమన‌గల్) లో ప్రపంచ ధ్యానమహాసభలు ప్రారంభమై 10 రోజులపాటు జరిగాయి.
 • 2012 డిసెంబరు 18, 19: జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి.
 • 2012 అక్టోబరు 7: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి మరణం.
 • 2012 జూలై 4: పాలమూరు జిల్లా కొత్త కలెక్టరుగా గిరిజా శంకర్ పదవి బాధ్యతలు చేపట్టారు.
 • 2012 మే 27: మహబూబ్ నగర్ పురపాలక సంఘంలో పరిసరాలలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేశారు.
 • 2012 మార్చి 31: కంచుపాడు గ్రామానికి చెందిన సురవరం సుధాకరరెడ్డి సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
 • 2012 మార్చి 17: అందుగుల ప్రాంతంలో క్రీ.పూ.1000 కాలం నాటి పురాతన వస్తువులు లభ్యమయ్యాయి.
 • 2012 ఫిబ్రవరి 10: మాడ్గుల ప్రాంతంలో ఇనుపయుగం కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి.
 • 2012 జనవరి 7: మహబూబ్‌నగర్ పట్టణంలో టివి నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
 • 2011 అక్టోబరు 30: మహబుబ్ నగర్ శాసన సభ్యులు ఎన్. రాజేశ్వర్ రెడ్డి మృతిచెందారు.
 • 2011 ఫిబ్రవరి 10: పాలమూరు జిల్లాకు చెందిన భాజపా నాయకురాలు వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
 • 2010 అక్టోబరు 20 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, గద్వాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.
 • 2010 సెప్టెంబరు: మహబూబ్‌నగర్ కాచిగూడ మద్య కొత్తగా డెము రైలు ప్రారంభమైనది.
 • 2010 ఫిబ్రవరి 14: జిల్లా పరిషతు చైర్మెన్ గా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగామోహన్ గౌడ్ మరనించారు.
 • 2009 డిసెంబరు 11: మాజీ మంత్రి పులివీరన్న మరణించారు.
 • 2009 అక్టోబరు 2: తుంగభద్ర నది వరదల వల్ల నదీతీర గ్రామాలు నీటమునిగాయి. ఆలంపూర్, రాజోలి, కుట్కనూరు, వేణీసోంపూర్ తదితర గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి.
 • 2009 మే: శాసనసభ ఎన్నికలలో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను తెదేపా 8, కాంగ్రెస్ 4 చోట్ల ఇండిపెండెంట్లు రెండు చోట్ల విజయం సాధించారు. 
 • 2009, జనవరి 16: బాబారాందేవ్ మహబూబ్‌నగర్ పట్టణానికి వచ్చారు.
 • 2008 జనవరి , 4 : నారాయణపేట మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లలితాబాయి నామాజీ మృతి.
 • 2007 డిసెంబర్, 27 : గడియారం రామకృష్ణశర్మ రచించిన శతపత్రం ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
 • 2007 డిసెంబర్, 2 : ఆమన్‌గల్ మండలాధ్యక్షుడు పంతూనాయక్ హత్య.
 • 2007 అక్టోబరు 7: జిల్లాకు చెందిన కవియిత్రి పాకాల యశోధారెడ్డి మరణించారు.
 • 2007 జూన్, 24 : భారీ వర్షపాతం వల్ల ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం నీట మునిగింది.
 • 2007 జనవరి,19 : కృష్ణానదిలో పుట్టి మునిగి 60 మంది మృతిచెందారు.
 • 2006 అక్టోబరు 26: ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ జిల్లాలో 7వ నెంబరు (ఇప్పటి 4వ నెంబరు) జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. 
 • 2006, జూలై 25: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ మరణించారు.
 • 2006 ఏప్రిల్ 10: జోగులాంబ రైల్వే స్టేషన్ (హాల్ట్) ప్రారంభించబడింది.
 • 2005 ఆగస్టు 15: మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 • 2005, జనవరి 26: భూమిలేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ పథకాన్ని రాష్ట్రంలో తొలిసారిగా కోడంగల్ లో ప్రారంభించబడింది.
 • 2003 ఫిబ్రవరి 24: పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మరియు రచయిత అయిన ముకురాల రామారెడ్డి మరణించారు. 
 •  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక