నారాయణపేట సమీపంలో ఉన్న ఎక్లాస్‌పూర్ లో ప్రాచీనమైన ఔదుంబరేశ్వరాలయం ఉంది. అడవులు, కొండల మధ్య వెల్సిన ఔదుంబరేశ్వరాలయం ఎంతో చారిత్రాత్మకమైనది. ఈ ఆలయంలో ప్రధాన ఆరాధ్యదైవం ఈశ్వరుడు. ఇది కర్ణాటక సరిహద్దులో ఉండుటచే జిల్లా వాసులే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 17వ శతాబ్దిలో లోకపల్లి సంస్థానాధీశూలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఎత్తయిన రెండుకొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల సుందర ప్రకృతిదృశ్యాలు, వర్షాకాలంలో కోండల పై నుంచి జాలువారే జలపాతం లాంటి నీటిధారలు భక్తులకు కనివిందు చేస్తాయి. ఆలయ సమీపంలోనే చూపరులను ఆకట్టుకొనే అపురూపమైన కోనేరు ఉంది. ఏనుగులు కోనేరు నీటిని త్రాగేందుకు అనువుగా నిర్మించారు. ఆలయం ప్రక్కన ఉన్న రెండు గుట్టలలో ఒకటి తేళ్లగుట్టగా ప్రసిద్ధి చెందింది. దీనిపై ఏ రాయి కదిలించినా ఎర్రతేళ్ళు దర్శనమిస్తాయి. మరోవైపు ఉన్న రాళ్ల గుట్టలో రాళ్ళు మాత్రమే ఉన్నాయి.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, నారాయణపేట మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి