22, ఏప్రిల్ 2013, సోమవారం

ఇబ్రహీంబాద్ (Ibrahimbad)

ఇబ్రహీంబాద్ గ్రామము
గ్రామముఇబ్రహీంబాద్
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2963 (2001),
3485 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575070
ఇబ్రహీంబాద్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2963. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 16 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 110 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. హేమసముద్రం చెరువు గ్రామపరిధిలో ఉంది. హేమసముద్రం చెరువు అలుగు సమీపంలో శ్రీవీరభద్రేశ్వరస్వామి ఆలయం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలనాథస్వామి ఆళయం, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
ఇబ్రహీంబాద్ గ్రామం మండలంలో ఉత్తరం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున బుద్ధారం, పశ్చిమమున మునిమోక్షం, దక్షిణమున అమ్మాపూర్, నాయినోనిపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 2963. ఇందులో పురుషులు 1437, మహిళలు 1526.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3485. ఇందులో పురుషులు 1761, మహిళలు 1724. గృహాల సంఖ్య 755, అక్షరాస్యత శాతం 48.6%. గ్రామ కోడ్ సంఖ్య 575070.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 141 ఓట్ల మెజారిటి లభించింది.

విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. తిరుమల గిరి, పుల్పోనిపల్లిలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.

విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక