మాగనూరు మండలంలోని కృష్ణా గ్రామంలో క్షేరలింగేశ్వరాలయం ఉంది. పూర్వం ఒకస్వామి తన 14వ ఏట ఇక్కడికి వచ్చి కేవలం క్షీరం (పాలు) మాత్రమే తీసుకొని 41 రోజుల తర్వాత అనుష్టానం చెందినట్లుగా కథనం. సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన కృష్ణమందిరం ఉంది. అనేక దేవాలయాలు కలిగిన ఈ గ్రామం ఒక గొప్ప అధ్యాత్మిక గ్రామంగా వెలుగొందుతోంది. కర్మకాండలు నిర్వహించడంలో ఇది దక్షిణకాశిగా పేరుపొందింది. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహిస్తున్ననూ ఈ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఏకైక గ్రామం ఇదే. గ్రామానికి రోజూ వందలాది భక్తులు వస్తుంటారు. వాడి-గుంతకల్లు రైలుమార్గంలో ఉన్న ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణలోనే ఇది అతి పశ్చిమాన ఉన్న రైల్వేస్టేషన్.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, మాగనూరు మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి