నల్లమల ప్రాంతంలో ఉన్న సలేశ్వర క్షేత్రంలో చెంచుల ఆరాధ్యదైవమైన లింగమయ్య కొలువైయున్నారు. క్రీ.శ.6వ శతాబ్దినాటికే ఇక్కడ లింగం ప్రతిష్టితమై ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయానికి ముందుభాగంలో సలేశ్వరతీర్థం ఉంది. హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న ఫరహాబాదు చౌరస్తా నుంచి అటవీ ప్రాంతంలో సుమారు 16 కిమీ వెళ్ళి అటు నుంచి మరో 6 కిమీ నడక ప్రయాణం సాగించి ఈ క్షేత్రానికి చేరవచ్చు. ఏటా చైత్రపౌర్ణమికి ఇక్కడ నల్లమల గిరిజనుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి