1948లో జన్మించిన మహ్మద్ హుస్సేన్ మానవపాడు మండలం కంచుపాడు నివాసి. మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్తమాన కవులలో ఒకరుగా పేరుగాంచిన హుస్సేన్ ఉపాధ్యాలుగా, కళాశాల ఉపన్యాసకలుగా పనిచేస్తూనే రచనారంగంలో రాణించారు. ఎం.ఫిల్‌లో అత్యున్నత ప్రతిభ కనబర్చి స్వర్ణపతకం పొందారు. 1999లో ఆలంపూర్ సీమ సంస్కృతాంధ్ర సాహిత్యం అంశంపై పరిశొధన చేసి పీహెచ్‌డి పట్టా పొందారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానం పొందడమే కాకుండా జిల్లాలో అనేక కవి సమ్మేళనాలలో, సాహితీగోష్టులలో పాల్గొని ప్రతిభ కనబర్చారు. సర్కార్ ఆసుపత్రి (నాటిక), హుస్సేన్ ఉక్తులు (పద్యాలు), ఝాన్సీరాణి (ఏకపాత్రాభినయం) తదితరాలు వీరి ప్రముఖ రచనలు.
విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, మానవపాడు మండలము, , |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి