చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి. ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై ఖచ్చినమైన ఆధారం లేదు కాని అతని రచనలు, మంత్రి పోషణల ప్రకారం జీవితకాలం క్రీ.శ.1480-1530గా నిర్ణయించారు. పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం చారకొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల ధర్మన్నను ఆ జిల్లావాడుగా పరిగణించడం జరిగింది. షితాబుఖానుగా పేరుపొందిన సీతాపతి మంత్రి ఎనుమలూరి పెద్దన పోషణలో ఉండి ఈ కావ్యాన్ని రచించినట్లు ఆధారాలున్నాయి. ధర్మన్న రచించిన చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందలి కథ చిత్రవిచిత్రమైనది. అందుకే గ్రంథానికి ఆ పేరుపెట్టబడినట్లు తెలుస్తుంది. చరిగొండ ధర్మన్న వంటి కవులను సాహిత్యకారులు పట్టింకోలేరని ఆరుద్ర లాంటివారే వాపోయారు. ధర్మన్న గంటకు వందపద్యాలు చెప్పగలిగే అవధాన విద్యాప్రవీణుడని అతని పద్యాలే చెబుతాయి. ధర్మన్న ‘శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాన సురవూతాణ చిహ్నిత నాయుడు, శతఘంట సురవూతాణుడు’ అన్న బిరుదులు గలవాడు. గంటకు నూరు పద్యాలు అల్ల గలిగిన శతావధాని అని దీని అర్థం. 17వ శతాబ్దిలో జ్యోతిస్యరత్నాకరం రచించిన చరిగొండ హోన్నయ్య కూడా ధర్మన్న వంశీయుడు.
విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, కల్వకుర్తి మండలము, |
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
- పాలమూరు సాహితీ వైభవం (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
- గోలకొండ పత్రిక సంచికలు,
- మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
sir
రిప్లయితొలగించండిkavi telugu lo rasara ? sanksrit lo rasara ?
సంస్కృతంలో రాశారనుకుంటాను.
తొలగించండి