28, మే 2013, మంగళవారం

ధన్వాడ (Dhanwada)

ధన్వాడ గ్రామము
గ్రామముధన్వాడ
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా8879 (2001)
9743 (2011)
గ్రామ కోడ్ సంఖ్య575494
గ్రామ సర్పంచిఇందిరమ్మ
గ్రామ ప్రముఖులుచిట్టెం నర్సిరెడ్డి,
ధన్వాడ నారాయణపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది ప్రాచీన చరిత్ర కలిగిన గ్రామము. లోకపల్లి సంస్థానాధీశుల కాలంలో ఇది ధనాగారముగా పనిచేసినట్లు ఆధారాలున్నాయి. ఆధునిక కాలంలో స్వాతంత్ర్యోద్యమం, విమోచనోద్యమంలో కూడా ఈ గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేసిన చిట్టెం నర్సిరెడ్డి, ఈ గ్రామానికి చెందినవారు. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8879. గ్రామంలో ప్రాచీనమైన శ్రీవెంకటేశ్వర ఆలయం, ఆంధ్రాబ్యాంకు శాఖ ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
ధన్వాడ గ్రామం మండలంలో పశ్చిమం వైపున నారాయణపేట మండలం సరిహద్దులో ఉన్నది. గ్రామానికి తూర్పున మందిపల్లి, దక్షిణాన కంసాన్‌పల్లి, ఉత్తరాన కిష్టాపుర్ గ్రామాలు ఉండగా పశ్చిమాన నారాయణపేట మండలం సరిహద్దుగా ఉన్నది. గ్రామ విస్తీర్ణం 2621 హెక్టార్లు.

చరిత్ర:
పూర్వం ఈ ప్రాంతం లోకపల్లి సంస్థానంలో భాగంగా ఉండటమే కాకుండా ఆ సంస్థానపు ధనాగారంగా ఉండేదని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ధనాగారం వల్లనే ధనవాడ (ధన్వాడ) పేరు వచ్చినట్లు కథనం. 1946-48 కాలంలో గ్రామంలో నిజాం వ్యతితేక పోరాటం ఉధృతంగా సాగింది. స్వామి రామానందతీర్థ కూడా ఇక్కడికి వచ్చి ప్రసంగించారు. అనేక మంది యువకులు విమోచనపొరాటంలో పాల్గొన్నారు. చిట్టెం నర్సిరెడ్డి వీరిలో ప్రముఖులు.
ధన్వాడ మండల పరిషత్తు కార్యాలయం

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేట వెళ్ళు ప్రధాన రహదారిపై ఉండుటచే రవాణా సౌకర్యాలు బాగుగా ఉన్నాయి. ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8879. ఇందులో పురుషులు 4365, మహిళలు 4514. గృహాల సంఖ్య 1627. మండలంలో ఇది రెండవ అత్యధిక జనాభా కల గ్రామము.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8879. ఇందులో పురుషులు 4887, మహిళలు 4856. గృహాల సంఖ్య 2170 అక్షరాస్యత శాతం 47.11%. గ్రామకోడ్ సంఖ్య 575494.

రాజకీయాలు:
  • 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఇందిరమ్మ విజయం సాధించారు. 
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో ధన్వాడ-1 స్థానం నుంచి రాజేశ్వరి (తెదేపా), ధన్వాడ-2 స్థానం నుంచి రాంచంద్రయ్య (భాజపా), ధన్వాడ-3 స్థానం నుంచి మల్లయ్య (భాజపా) ఎన్నికయ్యారు.

శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయం:
సంస్థానాధీశుల కాలం కంటే ముందు నుంచే ఇక్కడ ఆలయం ఉంది. చూడముచ్చటైన కోనేరు ఉంది.దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడైన హన్మప్ప వ్యాధి నయం కావడంతో ఆలయం ముందు భాగాన కోనేరు నిర్మించాడు.

కాలరేఖ:
  • 2009 ఏప్రిల్ 19: ధన్వాడ మాజీ మండల అధ్యక్షులు (2001-06 కాలంలో తెదేపా తరఫున) చిట్టెం శకుంతల ప్రతాపరెడ్డి మరణించారు. 
విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక