9, మే 2013, గురువారం

కడియం శ్రీహరి (Kadiyam Srihari)

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జన్మించిన శ్రీహరి 1987లో తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి 3 సార్లు శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యునిగా  పనిచేశారు. 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది.

రాజకీయ ప్రస్థానం:
1987లో ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి అదే సంవత్సరం వరంగల్ నగరపాలక సంస్థ చైర్మెన్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1988 నుంచి 2004 వరకు వరంగల్ జిల్లా తెదేపా కన్వీనర్‌గా పనిచేశారు. 1994, 1999లలో స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదెపా తరఫున విజయం సాధించారు. 1995 నుంచి 2004 వరకు ఎన్టీయార్ మరియు చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. 2004లో తెరాసకు చెందిన కెప్టెన్ విజయరామారావు చేతిలో పరాజయం పొంది, తెరాస ఎమ్మెల్యేల రాజీనామాలతో 2008లో జరిగిన  ఉప ఎన్నికలలో విజయం సాధించి మూడవ సారి శాసనసభలో ప్రవేశించారు. 2009లో మళ్ళీ ఓటమి చెందారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా, తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.తెలుగుదేశం పార్యీ తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని నిరసిస్తూ మే 11, 2013న పార్టీకి రాజీనామా చేసి 26 సంవత్సరాల తెదేపా బంధాన్ని విడిచిపెట్టారు. 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది. తాటికొండ రాజయ్య ఉధ్వాసనతో 2015, జనవరి 26న తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది. 2015, జూన్ 1న ఎమ్మెల్సీగా ఎన్నికైనారు.


విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు,  స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం,  పర్వతగిరి మండలము,  10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, రాష్ట్ర మంత్రులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక