కల్లూరి సుబ్బారావు అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు రాజకీయ నాయకుడు. అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో మే 25, 1897న జన్మించిన సుబ్బారావు మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించారు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావు , దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహం పెంపొందించుకున్నారు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛందసేవకునిగా పనిచేశారు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు. రాయలసీమలోనే తొలి రాజకీయ ఖైదీగా పేరుపొందారు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించేవారు. ఇతను 1924లో లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించారు.
స్వాతంత్ర్యం తర్వాత సుబ్బారావు మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు హిందూపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. 1955లో నల్లపాటి వెంకటరామయ్య స్పీకరుగా ఉన్నప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశారు. నీలం సంజీవరెడ్డి రాజకీయ గురువుగా పేరుపొందిన సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ పీసిసి కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీబాగ్ ఒప్పందంపై సంతకం చేసిన రాయలసీమ ప్రముఖులలో కల్లూరి సుబ్బారావు ఒకరు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాయలసీమ కురువృద్ధుడిగా ప్రసిద్దిచెందిన కల్లూరి సుబ్బారావు 1973, డిసెంబర్ 21న మరణించారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
25, మే 2013, శనివారం
కల్లూరి సుబ్బారావు (Kalluru Subbarao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి