16, మే 2013, గురువారం

మాడుగుల నాగఫణిశర్మ (Madugula Nagaphani Sharma)

 మాడుగుల నాగఫణిశర్మ
(అవధాన పండితుడు)
జననం1959, జూన్‌ 8
స్వస్థలంకడవకొలను
జిల్లాఅనంతపురం
మాడుగుల నాగఫణిశర్మ అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని కడవకొలను గ్రామంలో 1959 జూన్‌ 8న జన్మించారు. స్వగ్రామంలోనే పదో తరగతి పూర్తి చేసి 'సాహిత్య శిరోమణి' పట్టా కోసం తిరుపతి వెళ్ళారు. అక్కడే అతని ప్రతిభా వెలుగులు ప్రసరించడం మొదలైనా  ఆంధ్ర విశ్వ విద్యాలయంలో చదివే సమయంలో గుర్తింపు పొందారు. తర్వాత మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., కొత్త ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌ నుంచి 'శిక్షాశాస్త్రి', తిరుపతి రాష్ట్రీయ విద్యా పీఠం నుంచి పి.హెచ్‌.డి. పట్టా పొందిన మాడుగుల జీవిక కోసం 1985-90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్‌ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990-92 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అడిషనల్‌ కార్యదర్శిగా పని చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక అవధాన కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందారు. భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానులు నిర్వహించి 'సెహభాష్‌' అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ, వంటి అనేక బిరుదాలు పొందారు. పలుచోట్ల కనకాభిషేకాలు, స్వర్ణశారదా ముద్రిక, ముత్యాలజల్లు, ఆందోళికా భోగం, స్వర్ణ కంకణం, గండపెండేరం వంటివి పొందారు.

విభాగాలు: అనంతపురం జిల్లా ప్రముఖులు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక