మల్కోడ్ మాణిక్‌రావు
| |
స్వస్థలం | బషీరాబాదు |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
నిర్వహించిన పదవులు | రాష్ట్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎమ్మెల్సి, |
నియోజకవర్గం | తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం |
ఎం.మాణిక్ రావు రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. బషీరాబాదు మండల కేంద్రానికి చెందిన మాణిక్‌రావు 3 సార్లు శాసనసభ్యులుగా, రాష్ట్రమంత్రిగా, విధానమండలి సభ్యుడిగా వ్యవహరించారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా చెలామణి అయిన మాణిక్ రావు తన ఇద్దరు సోదరులను కూడా శాసనసభ్యులుగా గెలిపించుకున్నారు. తాండూరు ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ వీరే ఆద్యులు.
మాణిక్ రావు తొలిసారిగా 1972లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 1978లో రెండవసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవికి కూడా పొందినారు. ఆ తర్వాత తమ్ముడు ఎం.చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చి ఇతను తాత్కాలికంగా తప్పుకున్నారు. 1999లో మాణిక్ రావు పోటీచేసిననూ తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓటమి చెందినారు. మరో సోదరుడు ఎం.నారాయణరావు కూడా 2004లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినారు. తాండూరు నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలుగా పనిచేసి రికార్డు సృష్టించారు. 2009లో మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి చెందినారు. విధానమండలి పునర్వ్యవస్థీకరణ అనంతరం రెండేళ్ళు మాణిక్ రావు విధానమండలి సభ్యుడిగా కొనసాగారు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, బషీరాబాదు మండలము, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, శాసనమండలి సభ్యులు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి