13, జూన్ 2013, గురువారం

అమలాపురం లోకసభ నియోజకవర్గం (Amalapuram Loksabha Constituency)

అమలాపురం లోకసభ నియోజకవర్గం
జిల్లాతూర్పు గోదావరి
ప్రస్తుత ఎంపిచింతా అనురాధ
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన చింతా అనురాధ ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం
  2. ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం
  3. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  4. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  5. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  6. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం
  7. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
3వ 1962-67 బయ్యా సూర్యనారాయణ మూర్తి కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 బయ్యా సూర్యనారాయణ మూర్తి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 బయ్యా సూర్యనారాయణ మూర్తి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 కుసుమ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పి.వి.జి.రాజు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 కుసుమ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 కె.ఎస్.ఆర్.మూర్తి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 గంటి మోహనచంద్ర బాలయోగి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 జి.వి.హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 జి.వి.హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీ
17వ 2019- చింతా అనురాధ వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన జి.వి.హర్షకుమార్ తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టికి చెందిన పి.ప్రమీలాదేవిపై 40,005 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. హర్షకుమార్‌కు 368501 ఓట్లు రాగా, ప్రమీలాదేవి 328496 ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టి అభ్యర్థి డి.జి.వరలక్ష్మి 3వ స్థానంలో, టిపిపిపి అభ్యర్థి సూర్యనారాయణ 4వ స్థానంలో, భాజపా అభ్యర్థి ఉమామహేశ్వరరావు 5వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన చింతా అనురాధ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన గంటి హరీశ్ మాధూర్ పై 39,966 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 485,313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 445,347 ఓట్లు లభించాయి. జనసేనకు చెందిన డీఎంఆర్ శేఖర్ 254,848 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాలు, అమలాపురం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక