4, జూన్ 2013, మంగళవారం

గద్వాల పురపాలక సంఘము (Gadwal Muncipality)

 గద్వాల పురపాలక సంఘము
ఏర్పాటు1952
తొలి చైర్మెన్వకీల్ నాగప్ప
ప్రస్తుత చైర్మెన్(ప్రత్యేక పాలన)
వార్డులు26
నడిగడ్డగా పేరుపొందిన కృష్ణా-తుంగభద్రల నడుమ, సంస్థానాధీశులు ఏలిన, విద్వత్గద్వాలగా పేరుపొందిన గద్వాల పట్టణంలో 1952, జూన్ 12న పురపాలక సంఘం ఏర్పాటైంది. 2001 ప్రకారం 53601 జనాభాతో 6 చకిమీ పైగా విస్తీర్ణంతో విస్తరించియున్న ఈ పట్టణం సికింద్రాబాదు-కర్నూలు రైలుమార్గంపై ఉన్నది. 44వ నెంబరు జాతీయ రహదారి కూడా 18 కిమీ దూరం నుంచి వెళ్ళుచున్నది. ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమంలో మరియు విమోచనోద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ పురపాలక సంఘం చైర్మెన్లుగా పనిచేశారు. గద్వాల ప్రాంతంలో ప్రముఖ సమరయోధులుగా పేర్కొన్న పాగపుల్లారెడ్డి, డి.కె.సత్యారెడ్డిలు ఇక్కడ చైర్మెన్లుగా పనిచేసి తర్వాత శాసనసభకు ఎన్నికయ్యారు.

ప్రస్థానం:
1952లో పురపాలక సంఘం ఏర్పడినప్పుడు 9 వార్డులు ఉండగా ప్రస్తుతం 26 వార్డులతో కొనసాగుతున్నది. 1952లో వకీల్ నాగప్ప నుంచి డి.కె.సత్యారెడ్డి, పాగపుల్లారెడ్డి లాంటి సమరయోధులతో పాటు బొజ్జయ్యనాయుడు, సుబ్బారెడ్డి, భరతసింహారెడ్డి, వెంకట్రాములు, వేణుగోపాల్, అక్కల సాయిబాబా, అక్కల రమాదేవి, బి.ఎస్.కేశవ్ తదిరరులు చైర్మెన్లుగా పరిపాలించారు. ప్రస్తుతం ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా పురపాలక సంఘాలు,  గద్వాల,  తెలంగాణ పురపాలక సంఘాలు, గద్వాల డివిజన్,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక