జె.డి.శీలం
| |
జననం | ఆగస్టు 13, 1953 |
స్వస్థలం | పుసులూరు (గుంటూరు జిల్లా) |
పదవులు | ఐఏఎస్ అధికారి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి, |
జె.డి.శీలం ఆగస్టు 13, 1953న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరులో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చేశారు. కొంతకాలం ప్రకాశం జిల్లాలో పనిచేసి ఆ తర్వాత ఐఏఎస్ కు ఎంపికై 1984లో కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. 1998లో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించి 1999లో బాపట్ల లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి దగ్గుబాటి రామానాయుడు చేతిలో పరాజయం పొందారు. తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరేళ్ళ పదవీ కాలం అనంతరం 2012లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జూన్ 17, 2013న కేంద్రమంత్రిగా నియమితులైనారు.
విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, పెదనందిపాడు మండలం, కేంద్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, 1953, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి